పాలమూరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే…

పాలమూరు.. ఈ పేరు వెనక గొప్ప నేపథ్యం ఉంది. ఈ ప్రాంతం పేరుకు సార్థకత తెచ్చేలా జనం నేటికీ గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు.

పాలమూరు …ఈ పేరు వెనక ఒక గొప్ప నేపథ్యం ఉంది. పాలు సమృద్దిగా దొరికే ప్రాంతం కావటంతో పాల-మూరు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఎన్నో దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి పాలమూరు అని నామకరణం చేసినా నేటికీ ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 430 గ్రామాల నుంచి 12 వేల మంది పాడిరైతులు వివిధ డైరీలకు పాలను తరలిస్తారు. పాల ఉత్పత్తి, సేకరణలో పాడి రైతులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు లక్షా 18 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. జిల్లాలోని 15 యూనిట్ల నుంచి పాలను సేకరిస్తారు. మహబూబ్ నగర్ డైరీకి 57 గ్రామాల నుంచి 12 వేల లీటర్లు, కల్వకుర్తి డైరీకి 80 గ్రామాల నుంచి 33 వేల లీటర్లు, అచ్చంపేట డైరీకి 60 గ్రామాల నుంచి 9 వేల లీటర్ల పాలు వస్తాయి. ఇక నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో మిని బల్క్ కూలింగ్ యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 3 వేల లీటర్లు సేల్స్ పోగా హైదరాబాద్ – విజయ డైరీకి పాలను తరలిస్తారు.

పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పాలమూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అధికారులు – పాడి రైతుల సమన్వయంతో డైరీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. పాడి రైతులు పోటాపోటీగా పాల ఉత్పత్తికి కృషి చేస్తున్నారు. డైరీలలో పాలను ప్రాసెస్ చేసి ఎక్కువ సమయం నిల్వ ఉండేలా డైరీలో సిబ్బంది చర్యలు తీసుకుంటారు. పాల నాణ్యత పరీక్షలు జరిపి విజయ డైరీకి తరలిస్తారు.

పశువుల పంపిణీ పథకం కింద బీసీ, ఎస్సీ,ఎస్టీలకు సబ్సీడీ ద్వారా పశువులను అందజేస్తున్నారు. దాణా, ఇన్సూరెన్స్ కరవరేజీని పాడి రైతులకు అందిస్తున్నారు. తరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ పాలమూరు నేపథ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు ఇక్కడి పాడి రైతులు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy