పాలమూరు పచ్చదనానికి ప్రణాళికలు: కేటీఆర్

ktrQపాలమూరు జిల్లా పచ్చబడడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. గత పాలకుల నిర్లక్ష్యంతో ఎక్కువగా నష్టపోయింది ఈ జిల్లానే అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ భూత్పూర్‌లో రైతులకు చెక్కుల పంపిణీ చేశారు. కృష్ణా నది పక్కనే పారుతున్నా నదీ జలాలు వాడుకోలేని పరిస్థితి రైతులదన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం 32వేలు కోట్లు కేటాయిస్తే…కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు . రైతుల తలరాతలు మారాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. దేశంలో ఏ నాయకుడికీ రాని ఆలోచన, కార్యక్రమాన్ని సీఎం చేపట్టారని తెలిపారు. రైతన్నను సంపూర్ణ మనసుతో అర్థం చేసుకొని రైతుబంధు పథకం చేపట్టారన్నారు. వలసకూలీలు 17 వరకు చెక్కులు అందుకోకపోతే…స్వయంగా వారికి చెక్కులను చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy