పాలేరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఎక్కువ నీరు : హరీశ్

harishతెలంగాణ ప్రభుత్వం పాలేరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఎక్కువ సాగునీటిని అందించిందన్నారు మంత్రి హరీష్ రావు. పాలేరులో 60 ఏళ్ల కరువును 40 నెలల్లో తీర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటించారు హరీష్ రావు. కాకరవాయిలో భక్తరామదాసు ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ ను.. ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నెలాఖరులోగా సీతారామ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు తెస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా భద్రరామదాసు ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు హరీష్. గతంలో కరెంటు ఇవ్వటం చేతకానివాళ్లు.. ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు నేతలు.

ఖమ్మం పర్యటనకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండోరోజు పర్యటన కొనసాగించారు మంత్రి హరీష్. ఎమ్మెల్యేలతో సమావేశమై జిల్లాలో ప్రాజెక్టులపై చర్చించారు. ఇటీవల అమెరికాలో మరణించిన డాక్టర్ విశ్వనాథరావు కుటుంబాన్ని, ఆయన సోదరుడు ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావును పరామర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పారపల్లిలో.. పల్లె ప్రగతిలో పాల్గొన్నారు మంత్రి. కాళేశ్వరం తొలిఫలితం నర్సంపేట, పూర్వ వరంగల్ జిల్లాకే దక్కుతుందన్నారు. పాకాలను దేవాదులకు అనుసంధానం చేసి… రెండు పంటలకు గోదావరి నీళ్లిస్తామని చెప్పారు. వ్యవసాయానికి సాగు పెట్టుబడిపై ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్ లో.. అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రులు. కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 5 కోట్ల నిధులతో చేపట్టిన పనులను ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్దిని చూసి ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు మంత్రులు. ప్రజల్లోకి వచ్చి అభివృద్దిపై మాట్లాడాలని సవాల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy