పింక్ డే స్పెషల్: సర్కార్ ఆస్పత్రుల్లో రంగు దుప్పట్లు

bed sheetsరాష్ట్ర వ్యాప్తంగా పింక్ డే కు సర్వం సిద్ధమైంది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో రంగురంగుల బెడ్ షీట్ లు పంపిణీ చేయనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దవాఖానాల్లో గులాబీ బెడ్ షీట్స్ ను అందిస్తారు. 20 వేల బెడ్స్ కి లక్ష బెడ్ షీట్స్ పంపిణీ చేస్తున్నరు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులోని బెడ్స్ అన్ని గులాబీ మయం కానున్నాయి. బెడ్స్ తో పాటు రోగులకు చెద్దర్లు కూడా అందిస్తారు. దవాఖానాల్లో ఇన్ఫెక్షన్ సమస్య లేకుండా చేసేందుకు కొత్త బెడ్ షీట్స్ పంపిణీచేస్తోంది వైద్య ఆరోగ్యశాఖ. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా తయారు చేస్తోంది సర్కార్.

రోజుకో కలర్ బెడ్ షీట్ మార్చాలని సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగానే సోమవారం గులాబీ రంగు, మంగళవారం వైట్ కలర్ బెడ్ షీట్స్, బుధవారం లేత నీలిరంగు బెడ్ షీట్స్, గురువారం డార్క్ బ్లూ కలర్ బెడ్ షీట్ ..ఇలా ఏడు రోజులకు ఏడు రంగులున్న బెడ్ షీట్లను మార్చనుంది .

ఇక హైదరాబాద్ విషయానికొస్తే 14 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6477 పడకల కోసం 33వేల708 దుప్పట్లను సిద్ధం చేసింది సర్కార్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy