పింక్ డైమండ్: వేలంలో రికార్డ్ ధర

ఎంతో అందమైన..అత్యంత అరుదైన పింక్ డైమండ్ రికార్డు సృష్టించింది. ఈ పింక్‌ డైమండ్‌ అక్షరాలా రూ.363 కోట్ల రికార్డు ధర పలికిం ది. మంగళవారం (నవంబరు 13) రాత్రి  స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో దీనిని వేలం వేశారు. ఓపెన్‌ హీమర్‌ ఫ్యామిలీకి చెందిన 19 క్యారెట్ల ఈ అరుదైన గులాబీ వజ్రాన్ని డిబీర్స్‌‌‌‌ డైమండ్‌ మైనింగ్‌ కంపెనీ అప్పట్లో వెలికి తీసిందని చెబుతారు. ఇప్పుడు ఆ వజ్రాన్ని క్రిస్టీ అనే సంస్థ ఆన్‌ లైన్‌లో వేలం వేసింది. డైమండ్‌ను అమెరికాకు చెందిన హ్యారీ విన్ స్టన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ వజ్రాన్ని దక్కించుకున్నఅమెరికా సంస్థ వజ్రానికి వెంటనే ‘ఖవిన్‌ స్టన్‌ పింక్‌ లెగసీ’గా పేరు మార్చింది.

ఆ వజ్రం రియల్‌ ఓనర్‌ ఎవరోమాత్రం సంస్థ చెప్పలేదు. 10 క్యారెట్లకు పైబడిన ఇలాంటి  పింక్‌ డైమండ్లు నాలుగంటే నాలుగే వేలానికి వచ్చాయట.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy