కన్ను గీటినందుకు దుమ్ము రేపింది!

22499_852549128114947_5805799814465768671_nవెకిలి వేషాలేసిన ఒక పొలిటీషియన్ బాడీగార్డును ఓ యువతి చిత్తడి చేసింది. అగ్రాలో అపరకాళిక అవతారమెత్తింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు డాక్టర్ చెకప్ కోసం స్కూటీపై వెళ్తున్నారు. సేమ్ టైమ్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడి అనుచరుడు యువతికి  కన్నుగీటాడు. పిచ్చి పిచ్చి సైగలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన  ఆ యువతి కాళిక అవతారమెత్తింది.  కారులోంచి వేషాలేస్తున్న అతగాడ్ని దమ్ముంటే బయటకు రమ్మని సవాల్ చేసింది. అయితే అతగాడు ఎంతకూ   కారు దిగకపోయే సరికి ఆ యువతి ఆ మెర్సెడెస్ బెంజ్ కారుపైకి ఎగిరి దూకింది. కారు విండ్ షీల్డ్  పైకి ఎక్కి అద్దాలు పగలకొట్టింది.  పార్టీ జెండాను పీకి ముక్కలు ముక్కలు చేసింది. స్థానికులు, వాహనదారులు ఆమెకు మద్దుతుగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఆ నాయకుడి అనుచరుడికి బుద్ధి చెప్పాలని డిమాండ్  చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సదరు ఎస్పీ నాయకుడు మాత్రం దీనిపై  స్పందించడానికి  నిరాకరించాడు. ఆ యువతి మాత్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ గొడవలో పగిలిపోయిన తన మొబైల్ కు 6,500 రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తోంది ఆ యువతి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy