పిచ్చి ముదిరింది : డ్రైవర్‌ ముస్లిం..ఓలా క్యాబ్ క్యాన్సిల్

ola-cab_dfd5283e-2e63-11e7-9a1e-ae80039293d8క్యాబ్‌ బుక్‌ చేసుకుని.. ఆ వెంటనే దానిని క్యాన్సిల్ చేసుకున్న ఓ వ్యక్తి నిర్వాకం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. డ్రైవర్‌ ముస్లిం కావటమే తాను ఆ పని చేయటానికి కారణమంటూ ఆ వ్యక్తి ట్విట్టర్‌ లో పోస్టు చేశాడు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. అయోధ్యకు చెందిన అభిషేక్‌ మిశ్రా లక్నోలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం (ఏప్రిల్‌ 20) అతడు ఓలా క్యాబ్‌ ను బుక్‌ చేసుకున్నాడు. క్యాబ్‌ డ్రైవర్‌, ఇతర వివరాలను ఓలా సర్వీస్ అతని మొబైల్‌ కు పంపగా.. అర్థాంతరంగా అతను తన బుకింగ్‌ ను క్యాన్సిల్‌ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా వెంటనే ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. ఓలా క్యాబ్‌ ను రద్దు చేసుకున్నానని.. ఎందుకంటే ఆ డ్రైవర్‌ ఓ ముస్లిం. నా సొమ్మును జిహాదీ ప్రజలకు ఇవ్వటం ఇష్టం లేదు అంటూ ట్వీటర్లో పోస్టు చేశాడు.

ఇక అతని ట్వీట్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వారు దేశానికి ప్రమాదకరమని కొందరు రీట్వీట్లు చేస్తే.. ఇలాంటోళ్లను దేశం నుంచి తరిమేయాలని మరికొందరు.. దేశానికి చెడ్డ పేరు తెచ్చేది ఇలాంటి వారేనంటూ తిట్టిపోస్తున్నారు. మతం పిచ్చి బాగా ముదిరిందని కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్లు – కస్టమర్ల మధ్య ఫ్రెండ్లీగా వ్యవహరించాల్సిన బాధ్యత మాది. ఒకరినొకరిని గౌరవించాలనే మేం చెప్పేది. అంతే కానీ కుల, మత, ప్రాంతీయ బేధాలు మాకు లేవు అంటూ ట్విట్‌ చేసింది ఓలా.

అభిషేక్‌ కు VHP, భజ్‌ రంగ్‌ దళ్‌, RSS  తదితర సంస్థలతో సంబంధం ఉంది. VHP ఐటీ విభాగానికి అతను పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ను పలువురు కోరుతున్నారు. తనపై వస్తున్న విమర్శలకు అభిషేక్‌ అదే స్థాయిలో రిప్లయ్ ఇస్తున్నాడు. హనుమంతుడి పోస్టర్లను క్యాబ్‌ లపై వేసి నడిపించినప్పుడు.. నా వాదనను ఎందుకు అంగీకరించరు అంటూ ఓ మహిళ చేసిన ఫేస్‌ బుక్‌ పోస్టును ట్విట్ చేశాడు అభిషేక్‌.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy