సొంతింటి ముందే బిచ్చగాడిగా కోటీశ్వరుడు

2D28367C00000578-0-image-a-85_1444196588803లంకంత కొంప ఉంటుంది. అయినా ఓ డార్క్ రూమ్ లో కాలం వెళ్లదీస్తుంటాడు ఆ భర్త. భార్యే అతన్ని అలా పెడుతుంది. కొన్నిరోజులకు కోడలు వచ్చి ఆయన్న మళ్లీ బయట ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇదంతా వెంకటేశ్ హీరోగా నటించిన అబ్బాయిగారు సినిమాలోని స్టోరీ. అచ్చు అలాంటి స్టోరీ కాదు కానీ.. ఇది చదివితే మీకు అదే గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ఈ పక్క ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు షరాఫత్ ఖాన్.. వయస్సు 69 ఏళ్లు. ఉండేది అమెరికాలోని టెక్సాస్. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటికి యజమాని.. పిచ్చోణ్ణి చేసి ఇలా గెంటేసింది భార్య. చూడ్డానికి పిచ్చోడిలా ఉన్నా.. నిజంగా పిచ్చోడు కాదు. గత ఆరేళ్లుగా భార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాలేనని ఇరుగుపొరుగు అంటున్నారు. ఆరు నెలల నుంచి ఈ గొడవలు మరీ ముదిరాయి. దీంతో భర్తను బయటకు గెంటేసింది భార్య. అప్పటి నుంచి ఇదిగో ఈ ఇంటి ముందున్న లాన్ లోనే దొరికింది తింటూ ఇలా ఉన్నాడు. ఒక్కోసారి లాన్ లోని ఈ అరుగుపై లేదా.. ఇంటివెనక ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకుంటాడు. పాపం ఎవరైనా జాలిపడి ఏదైనా ఇద్దామన్నా ఇవ్వనీయడం లేదు ఆ భార్యామణి. ఇలా వచ్చే వారికి హెచ్చరిక అన్నట్టు గేటు బయట నోటీస్ కూడా అంటించింది. “ఇతనికి ఎవరూ ఏమీ తీసుకురావద్దు. ఏమైనా తీసుకొస్తే.. మీరే ఆయన్ను తీసుకెళ్లండి” అని నోటీసులో రాసింది. దీంతో ఆ ఇంటివైపు చూడ్డమే మానేశారు. ఇంత ఎందుకు హాయిగా విడాకులు ఇచ్చేయొచ్చుగా అని ఎవరైనా అంటే తమది ఇస్లాం మతమని… షరియత్ లాను ఫాలో అయ్యే తాము.. విడాకులకు దూరమంటున్నాడు.  పాపం ఆ భర్తగారు మౌన పోరాటం సినిమాలో హీరోయిన్ లా ఇలా ఇంటిముందే మౌనంగా ఉండిపోతున్నారు.  ఈయనగారికి ఇదొక్కటే కాదు.. మరిన్ని ఆస్తులు ఉన్నాయి. ఖాన్ ఇన్వెస్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. ఇన్ని ఉన్నా.. ఏం చేస్తాడు.. భార్య దెబ్బకు ఇలా వీధిలో పడ్డాడు. చూసిన వాళ్లు పాపం అనుకోవడం తప్ప ఇంకేమి చేయలేకపోతున్నారు.

2D27FDA000000578-3262882-image-a-67_1444195700753

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy