పిడుగు మంటలు ఎలా ఉంటాయో తెలుసా

pppఎక్కడో దూరంగా పిడుగులు పడిన శబ్ధం విన్పిస్తే చాలు గుండెలు గుబేలుమంటాయి. దీనికి భారీ వర్షం తోడైతే ఇక చెప్పనక్కరలేదు. అదీ మన కళ్లముందు జరిగితే ఎలాఉంటుంది.. పిడుగు పడి ఎలాంటి వస్తువైనా ఎలా కాలిపోతుందో ఎప్పుడైనా చూశారా. చైనాలోని షెన్యాంగ్‌ ప్రాంత ప్రజలు పిడుగు పడటాన్ని ప్రత్యక్షంగా చూశారు. అది కూడా రోడ్ల మీద రయ్‌మంటూ దూసుకెళ్లే వాహన దారులు. ఈ నెల(మే) 11న చైనాలోని లియానింగ్‌ ప్రావిన్స్‌లోగల షెన్యాంగ్‌లో పెద్ద మొత్తంలో గాలిదుమ్ము వచ్చింది. ఆ సమయంలో వర్షంపడటంతోపాటు పెద్ద పెద్ద ఉరుములు శబ్ధం కూడా వినిపిస్తోంది.

సరిగ్గా అదే సమయంలో షెన్యాంగ్‌లోని రద్దీగా ఉండే ఓ కాలనీలో కారు వాహనదారులు తమ కార్ల వైఫర్లు ఆన్‌ చేసుకొని దూసుకెళుతుండగా నడి రోడ్డుపై భారీ పిడుగు పడింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న చెట్లు మాడిపోయి వాటి ఆకులన్నీ కూడా నిప్పుల వర్షంలాగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వారంతా కూడా తమ వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి గజగజ వణికిపోయారు. మొదట ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్మినట్లు… ఆ వెంటనే భారీ వెళుతురుతో నిప్పుల వర్షాన్ని కురిపించింది ఆ పిడుగు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ కారులోని కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy