పిల్లలపై క్రూరత్వం : పనిలోకి రాలేదని.. బట్టలూడదీసి తిప్పారు

CHILDపొలంలో పని చేసేందుకు నిరాకరించినందుకు చిన్నారులను దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించారు. అదీ కూడా భగభగమండే ఎర్రటి ఎండలో. ఈ దారణ సంఘటన జరిగింది రాజస్ధాన్‌ రాష్ట్రంలో. ఈ ఫొటోలు విజువల్స్ బయటకు రావటంతో బాలల హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగాయి. వివరాల్లోకి వెళితే..

బికనీర్‌ సమీపంలోని మోతావ్తా గ్రామంలో పొద్దుతిరుగుడు పంట సాగు చేయటం కోసం కొంత మంది పిల్లలను పని కోసం అడిగారు స్థానిక జమిందార్లు. పని చేయమని.. పొలాల్లోకి వచ్చేది లేదని ఆ పిల్లలు చెప్పారు. పెద్దలకే ఎదురుతిరుగుతారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెత్తందార్లు. ఆగ్రహంతో ఊగిపోతేూ.. ఆ పిల్లలను దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడదీసి.. ఎర్రటి ఎండలో పిల్లలను 2 కిలోమీటర్లు నడిపించారు. అందరూ చూస్తుండగా కర్రలతో కొట్టారు. ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు.

ముగ్గురు పిల్లలను గణేష్‌ సింగ్‌ అనే వ్యక్తి.. మరో నలుగురితో కలిసి పొలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గ్రామం వరకూ నగ్నంగా నడిపించాడని పోలీసులు తెలిపారు. బాలురను వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనం అయ్యింది.  పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు పిల్లలను దారుణంగా వేధించారని పోలీసులు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు పోలీస్ ఉన్నతాధికారులు. బాలల హక్కుల సంఘాలు కూడా ఈ ఘటనపై పోరాటం మొదలుపెట్టాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy