పీఎంవోనే కదిలించిన కుర్రాడు

bridge 600_1444823244ఎనిమిదేళ్ల కుర్రాడు…  మూడో తరగతి చదువుతున్నాడు. అందరి పిల్లల్లాగే ఇల్లు.. స్కూల్… ఆటలు. వీటితో పాటు మరొకటి ఆ పిల్లాడి జీవితంలో యాడ్ అయ్యింది. అదే ట్రాఫిక్ లో గంటపాటు గడపటం. పెద్దోళ్లంటే అలవాటు చేసుకుంటారు. పాపం ఆ పిల్లాడు ఏం చేస్తాడు. ఇది డైలీ కంటిన్యూ అయ్యేదే అయినా.. దాన్ని మాత్రం ఆ పిల్లాడు అలాగే వదల్లేదు. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి మెయిల్ పెట్టేలా చేసింది. ఆ మెయిల్ కు ఆన్సర్ కూడా వచ్చిందండోయ్. చిన్నోడైనా.. పెద్దపని చేశావ్ రా అని అందరూ మెచ్చుకొనేలా చేసింది.

ఆ పిల్లాడి పేరు అభినవ్. బెంగుళూరు విద్యారణ్యపురలోని నేషనల్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ఉండేది స్కూల్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని యశ్వంత్ పుర.  కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్కూల్ కు వెళ్లడానికి అభినవ్ కు రోజూ 45 నిమిషాల పైనే పడుతోంది. ఇంత సేపు ఎందుకంటారా.. ఆ దారిలో అసంపూర్తిగా ఉన్న ఓ ఫ్లై ఓవర్. అదీ కూడా నార్త్ బెంగుళూరుకి అది కీ జంక్షన్. రోజూ అక్కడి నుంచే వెళుతుంటాడు అభినవ్. కానీ స్కూల్ కు వెళ్లాల్సిన టైమ్ కంటే ఓ గంట ముందుగా.. ఇదే ఆ కుర్రాడిలో తీవ్ర అసహనాన్ని కలిగించింది. అందరు పెద్దాళ్లా చూస్తూ కూర్చోలేదు. రోజూ గంటల కొద్దీ తన సమయాన్ని తినేస్తున్న ఆ ఫ్లైఓవర్ పై వెంటనే ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. వెంటనే పీఎంవోకు మెయిల్ పెట్టేశాడు. “సార్ ఈ ఫ్లై ఓవర్ పబ్లిక్ హెల్త్ మాత్రమే కాదు.. నా స్టడీస్ కి కూడా నష్టం కలిగిస్తోంది” అంటూ తన బాధనంతా ఆ మెయిల్లో పెట్టాడు. ఏంట్రా ఇది అని ఆరా తీస్తే.. ఆ ఫ్లై ఓవర్ డిఫెన్స్ వాళ్ల నుంచి నిధులు రాకపోవడంతోనే ఆగిపోయిందని తెలిసింది. దీంతో వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశమిచ్చారు.

49350885

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy