పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం సక్సెస్

28brk80aఅగ్రరాజ్యాల సరసన ఇండియాను నిలపాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆస్ట్రో శాట్ ఉపగ్రహాన్ని భారత్  సక్సెస్ గా ప్రయోగించింది. శ్రీహరి కోటలోని షార్ సెంటర్ నుంచి పొలార్  శాటిలైట్ వెహికిల్( పీఎస్ఎల్ వీ)-సి30 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. విశ్వం మూలాలను తెలుసుకునేందుకు.. రేడియేషన్,వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు. పీఎస్ఎల్వీ-సీ 30 ఒక్కొక్క ఉపగ్రహం విడిపోయి వాటి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించడంతో ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఖగోళ పరిశోధనలకు సంబంధించి ఇస్రో ఫస్టు టైం చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్ర వేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

pslv-c-30ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 1,513 కిలోల ఆస్ట్రోశాట్ తో పాటు ఇండోనేషియా లాపాన్-2(68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా(5.5) యూఎస్ కు సంబంధించిన లెమర్-2,3,4,5(16కిలోలు) ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-30 నింగిలోకి తీస్కెళ్లింది. ఉపగ్రహాల మొత్తం బరువు 1,630 కిలోలు. ఇండోనేషియా, కెనడా, అమెరికా దేశా ఉపగ్రహాను నింగిలోకి పంపడంతో ఆ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్ కు చేరుకుని ప్రయోగాన్ని చూశారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy