పీక్ స్టేజ్: సెల్ఫీ దిగుతూ…లోయలో పడింది

California-bridge- ladyఅమెరికాలోని అత్యంత ఎత్తైన హిల్ బ్రిడ్జ్ పై సెల్పీ దిగుతూ కాలు జారిజారి కింద పడిపోయింది ఓ యువతి. కాలిఫోర్నియాలోని అబర్న్ సమీపంలో గల ఫారెస్ట్‌హిల్ బ్రిడ్జిపై ఈ దుర్ఘటన జరిగింది. సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా కాలు స్లిప్ అయి అంత్యంత ఎత్తులో నుంచి పడిపోయింది. 60 ఫీట్ ల ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది ఆ మహిళ. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిందామె.

అమెరికాలోని సాక్రామెంటో ప్రాంతానికి చెందిన ఈ మహిళ ప్రాణాలతో బయటపడటం అదృష్టమన్నారు ఆమె స్నేహితురాలు గాన్‌చారక్. ఆ బ్రిడ్జిపైకి వెళ్లడానికి నిషేధం ఉన్నా.. సెల్పీదిగేందుకు ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్లారు. బీమ్ లను పట్టి ఉంచే బోల్టుల దగ్గర ఆమె నిలబడి ఒక ఫోటో దిగింది. క్యాట్ వాక్ కూడా చేసింది.  అనంతరం పైకి ఎక్కి మరో ఫోటో దిగబోయి కిందపడిపోయింది. ఆమె కింద పడేటప్పుడు చెట్ల మీద పడుకుంటూ వెళ్లడంతో.. స్వల్ప గాయాలలు తగిలాయి. నేలమీద డైరెక్టుగా పడకపోవడంతో ప్రాణాలతో బయటపడిందామె. పడినవెంటనే స్పృహ కోల్పోయిందని చెప్పింది స్నేహితురాలు పాల్ గాన్‌చారక్.

బ్రిడ్జి మీద, వాక్‌వే మీద ప్రజలు నడవడాన్ని నిషేధించారు పోలీసులు. ఆ బ్రిడ్జిపై ఎవరైనా కనబడితే అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంది. ఎత్తైన కట్టడాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కాలిఫోర్నియా పోలీసులు

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy