పుణె టెస్ట్: ఆస్ట్రేలియాపై అశ్విన్ మాయాజాలం

indian-crickపుణె వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 256పరుగులు చేసింది. మొదటి రోజు తొలి సెషన్‌లో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు రెండు, మూడు సెషన్లలో తడబడింది. తక్కు టైంలోనే వికెట్లు కోల్పోతోంది. ఓపెనర్‌ రెన్‌ షా(68) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. వార్నర్ (38), స్మిత్ (27) రన్స్ చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ బాటపట్టారు. అతి కష్టం మీద 81వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. 81వ ఓవర్‌ ముగిసే సరికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 82వ ఓవర్లో ఇద్దరు ఆటగాళ్లు వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ ఉన్నారు.

10ఓవర్లలో 25పరుగులిచ్చిన ఉమేశ్‌ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy