పుణె టెస్ట్: భారత్ టార్గెట్ 441

pune testపుణెలో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 285 రన్స్ కు ఆలౌట్ అయింది. స్టీవెన్ స్మిత్ 109 రన్స్ చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. డేవిడ్ వార్నర్ 10, షాన్ మార్ష్ 0, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 90, రెన్షా 31, మిషెల్ మార్ష్ 31, వేడ్ 20, స్టార్క్ 30 , ఒకీఫ్ 6, లియాన్ 13 రన్స్ చేశారు. భారత్ ముందు 441 రన్స్ అతి భారీ టార్గెట్ పెట్టారు.

ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయిన చోట… మన బౌలర్లు తమ ఫ్లాప్ షో చూపించారు. కంగారూ బ్యాట్స్ మెన్ భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. అశ్విన్ 4, రవీంద్ర జడేజా 3, ఉమేశ్ యాదవ్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. ఏ రకంగా చూసినా.. భారత్ కు ఇది అసాధ్యమైన టార్గెట్ గానే కనిపిస్తోంది.

స్కోరు వివరాలు:

ఆసీస్: 260 & 285

ఇండియా: 105

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy