చంద్రుల ఆనందహేళ

KCR WITH BABU (2)ఎనిమిది నెలల తర్వాత డైరెక్టుగా సమావేశం. ఓటుకు నోటు స్కాం…ఇద్దరు చంద్రుల మధ్య దూరం పెంచింది. అమరావతి శంకుస్థాపన ఆ ఇద్దర్నీ కలిపింది. ఇంటికొచ్చిన అతిథికి ఆత్మీయ ఆహ్వానం పలికారు సీఎం కేసీఆర్. శంకుస్థాపనకు రావాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. గంటసేపు సాగిన ఇద్దరు సీఎంల భేటీలో…ఆహ్వానాలతో పాటు…రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ జరిగింది.

“రండి.. అమరావతి శంకుస్థాపనలో పాలు పంచుకొండి… ఈ నెల 22న జరిగే శంకుస్థాపనకు హాజరవ్వండి… ఆంధ్ర ప్రదేశ్ అభవృద్ధికి సహాకరించండి” అంటూ సీఎం కేసీఆర్ కు సాదరంగా ఆహ్వానం పలికారు AP సీఎం చంద్రబాబు నాయుడు..నిన్న సాయంత్రం కేసీఆర్ నివాసానికి వెళ్లిన AP సీఎం… బోకే తో పాటు.. ఆహ్వాన పత్రికను అందించారు. సీఎం కేసీఆర్ తో పాటు… డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి కూడా బాబు స్వాగతం పలికారు. బాబు తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ లీడర్…ఎర్రబెల్లి దయాకర్ రావు.. హాజరయ్యరు.

ఆహ్వానం పలికేందుకు ఇంటికొచ్చిన చంద్రబాబుకు ఎదురొచ్చి మరీ కేసీఆర్ లోపలికి తీస్కెళ్లారు. కేసీఆర్ కు  శాలువా కప్పి… తిరుపతి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఇక తెలంగాణలోని అన్ని ముఖ్య పుణ్యక్షేత్రాలతో పాటు మహామహుల జన్మస్థలం నుంచి… మట్టిని సేకరించి… ఏపీ రాజధాని నిర్మాణం కోసం పంపాలని కోరారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది.

KCR WITH BABU (1)సమవేశంలో అమరావతి శంకుస్థాపన వివవరాలు బాబును అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. రాజధానిలో అసెంబ్లీకి ఎంత భూమి కేటాయించారు…నిర్మాణ విధానం ఎలా ఉండబోతుంది లాంటి విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు నదుల అనుసంధానం.. అభివృద్ధిపై కూడా ఇరువురు సీఎంలు చర్చించుకున్నారు. మరోవైపు సీఎం కుటుంబ సమేతంగా హాజరవ్వాలని కోరిన చంద్రబాబు..ఎలా వస్తారనే దానిపై కూడా వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు…గవర్నర్ నర్సిహన్ ను ఆహ్వానించారు… శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందించారు. దీంతో రాజధాని నిర్మాణ పనులపై ఆరా తీశారు గవర్నర్.

KCR WITH BABU (3)దాదాపు ఎనిమిది నెలల తర్వాత చంద్రబాబు.. కేసీఆర్ ను కలిశారు. ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంల మధ్య దూరం పెరిగినట్టు వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఓ దశలో చంద్రబాబు అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. దాంతో ఇద్దరి సీఎంల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అలాంటి టైంలో సీఎంలిద్దరి కలియిక ఆసక్తిగా మారింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy