పురోహితులకు జీతాలు ఇస్తున్న ఘనత కేసీఆర్ దే : కేటీఆర్

హైదరాబాద్ : దేశంలో పురోహితులకు జీతాలు ఇస్తుంది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇవాళ (నవంబర్-08)న హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు. బ్రాహ్మణుల స్థితిగతులు సీఎం కేసీఆర్ కు తెలిసినంతగా ఏ ముఖ్యమంత్రికి తెలియవన్నారు. విశ్వకల్యాణం కోసం కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం ప్రకారం నడుస్తారని..దేవాలయాల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేసీఆర్ మాదిరిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి దేవాలయాలను అభివృద్ధి చేయలేదని కేటీఆర్ తెలిపారు. గోదావరి పుష్కరాలు తెలంగాణలో జరపాలని కేసీఆర్ అప్పట్లోనే డిమాండ్ చేసినట్లు చెప్పారు. మీ ఆశీర్వాదం, ఎన్నికల్లో మద్దతు కోసం వచ్చానని బ్రాహ్మణులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy