పుల్వామాలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు మృతి

Encounterజమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం(జూన్-29) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఎన్‌కౌంటర్ ప్రాంతం సమీపంలో కొందమంది భద్రతా దళాలపై రాళ్లురువ్వడంతో తలెత్తిన ఘర్షణల్లో గాయాలతో ఒక యువకుడు కూడా మృతి చెందాడు. అయితే ఆ ఇంట్లో కొందరు జనం కూడా ఉండటంతో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో ఆలస్యం జరిగింది. అక్కడ్నించి పౌరులను తరలించిన తర్వాత భద్రతా బలగాలకూ, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయని, ముగ్గురు ఉగ్రవాదులనూ బలగాలు మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy