పుల్వామాలో కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు మృతి

indianarmyజమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా డ్రాబ్‌గ్రామ్‌ ప్రాంతంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సమీర్‌ టైగర్‌, ఆఖిబ్‌ ఖాన్‌ అనే ఇద్దరు  ఉగ్రవాదులు చనిపోయారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారనే ఇన్ఫర్మేషన్ అందుకున్న CRPF జవాన్లు  అలర్టయి అక్కడకు చేరుకున్నారు. దీంతో  ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి గాయపడ్డారు. తర్వాత భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో మృత్యువాత పడ్డ వారిలో సమీర్‌ టైగర్‌ అలియాస్‌ మనాన్‌ వాని అనే వ్యక్తి పీహెచ్‌డీ పూర్తి చేసుకుని ఈ ఏడాది జనవరి నెలలో ఉగ్రవాదుల్లో చేరినట్లు సమాచారం.

ఘటనాస్థలిలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండవచ్చన్న అనుమానంతో జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు.  కాల్పుల తర్వాత డ్రాబ్‌గ్రామ్‌ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు జవాన్లు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy