పుల్వామాలో టెన్షన్.. కాల్పుల్లో ఏడుగురు పౌరులు, సైనికుడు మృతి

సౌత్ కశ్మీర్ లోని పుల్వామాలో ఉదయం నుంచి భీకరమైన ఎన్ కౌంటర్ జరుగుతోంది. సిర్నూ గ్రామంలో భద్రతాబలగాలు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తుంటే…. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సైనికులు ఎదురుకాల్పులు చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వీరిలో.. టెర్రరిస్ట్ గా మారిన ఓ సోల్జర్ కూడా ఉన్నాడు. ఐతే.. ఎన్ కౌంటర్ తర్వాత అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్థానికులు, భద్రతాబలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. టెర్రరిస్టులతో, భద్రతాబలగాల ఎన్ కౌంటర్ కూడా కొనసాగింది. ఈ ఘర్షణలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు పదిహేను మంది వరకు గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. టెర్రరిస్టులు, ఆర్మీ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy