పుష్కరాల కోసం చెట్లు నరికివేస్తున్నారు

TREESఅమరావతిలో ఒకవైపు రాజధాని పనులు, మరోవైపు పుష్కర పనులు జోరుజోరుగా జరుగుతున్నాయి. ఈ పనులకు ఏది అడ్డొచ్చినా నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నారు. ఇళ్లు, బిల్డింగులు, గుళ్ళూ గోపురాలు ఏవైనా సరే….అడ్డొస్తే కూల్చేస్తున్నారు. వీటితోపాటు అనేకచోట్ల చిన్న మొక్కలనుంచి మహావృక్షాల వరకు నరికేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పచ్చనిచెట్లుతో చక్కగా కనిపించిన రోడ్లు ఈవేళ బోసిగా  దర్శనమిస్తున్నాయి.

ఎన్నో ఏళ్ళుగా నీడనిచ్చిన మహావృక్షాలను నిర్ధాక్షణ్యంగా నరికేస్తున్నారు. విజయవాడలో ఏ రోడ్డుకెళ్లినా రాజధాని పనులో, పుష్కరాల పనులో కనిపిస్తున్నాయి. పిన్నమనేని క్లినిక్ రోడ్డు, గాయత్రినగర్, పంజాసెంటర్, అర్జున్ వీధి ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లు వెడల్పు పెంచారు. ఆ ప్రాంతాల్లో ఏది అడ్డుగా ఉన్న తొలగించడంతోపాటు దశాబ్దాలనాటి మహావృక్షాలను సైతం నరికేశారు.

బెజవాడను ఇప్పటికే బ్లేజ్ వాడగా పిలుస్తారు… సిటీకి చుట్టూ ఉన్న కొండల ప్రభావంతో విపరీతమైన టెంపరేచర్లు    నగర వాసులను బెంబేలెత్తిస్తుంటాయి. ఇక ఇప్పుడు ‘అభివృద్ది’ పేరుతో….ఉన్న చెట్లును నరికేస్తే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని మొక్కలు నాటినంతమాత్రాన గ్రీనరీ కాదని మనం విడిచే కార్బన్ డై యాక్సైడ్ ను తీసుకునే వృక్షాలు ఉన్నప్పుడే నిజమైన గ్రీనరీ అని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

లెక్కప్రకారం, భూ వైశాల్యంలో 34 శాతం అటవీప్రాంతం లేదా విరివిగా చెట్లు ఉండాలి. ఐతే ,కృష్ణా జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 22 శాతం అటవీప్రాంతం ఉన్నట్లు చెపుతున్నా… వాస్తవంగా ఏడు శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ వేత్తలు  అంటున్నారు. ఇక విజయవాడ నగరంలో కూడా దాదాపుగా ఇదే పరిస్ధితి కనిపిస్తోంది… లెక్కప్రకారం సిటీలో సుమారు 15 లక్షల చెట్లు ఉండాల్సి ఉన్నా… అధికారలెక్కల ప్రకారమే ఐదు లక్షలున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా ముప్పై వేలుకు మించి చెట్లు నగరంలో లేవనేది పర్యావరణ వేత్తలవాదన.

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వనం మనం మంచి స్కీమ్. అలాగే, ఉన్నవాటిని కాపాడుకోడానికి కూడా ఒక స్కీమ్ ఉంటే చాలా చెట్లు బతికి బట్టకడతాయోమో.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy