సుధీంద్రపై రంగు పోశారు

BEERENDRAఉద్రిక్తతల మధ్యే… పాకిస్థానీ మాజీ మంత్రి కసూరి రాసిన పుస్తకం ఇండియాలో విడుదలైంది. ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్ లో… ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రోగ్రామ్ ను అడ్డుకుంటామన్న శివసేన… లాస్ట్ మినిట్ లో కాస్త తగ్గింది. దీంతో… ఈ ఇష్యూ వయలెంట్ లోగా మొదలై… సైలెంట్ గా ముగిసింది.

చరిత్రను వక్రీకరించేందుకు తాను పుస్తకం రాయలేదన్నారు పాకిస్థాన్ మాజీ విదేశాంగ శాఖా మంత్రి ఖుర్షిద్ మహముద్ కసూరి. రెండు దేశాల్లోనూ చరిత్ర హత్యకు గురైందన్న కసూరి… దురాభిప్రాయాలను తొలగించేందుకు నీదర్ ఎ హక్ నార్ ఎ డవ్ పేరుతో పుస్తకం రాసినట్టు చెప్పారు. ఈ బుక్ కాపీలను రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత అద్వానీ, మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ లకు పంపినట్టు తెలిపారు. నిజాలను మాత్రమే తన బుక్ లో రాశానని… నిజాలను ఏమార్చేందుకు కాదన్నారు కసూరి.

కసూరీ పుస్తకం ఉద్రిక్తతల మధ్య ముంబైలోని నెహ్రూ సెంటర్ లో విడుదలైంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ చీఫ్ సుధీంద్ర కులకర్ణి నీదర్ ఎ హక్ నార్ ఎ డవ్ బుక్ ను ఆవిష్కరించారు. కసూరీ తల్లిదండ్రులు భారతదేశ భక్తులేనని కులకర్ణి చెప్పారు. గత తప్పులను దిద్దుకోవడం మన బాధ్యత అన్న కులకర్ణి… ఈ బుక్ రిలీజ్ అవసరాన్ని అర్థం చేసుకోవాలని… నిన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను కలిసి రిక్వెస్ట్ చేశానన్నారు. పాక్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాకు, భారత జాతిపిత మహాత్మ గాంధీలకు ముంబై కర్మభూమి అన్నారు.

అంతకుముందు పుస్తకావిష్కరణను అడ్డుకునేందుకు శివసేన ప్రయత్నించింది. సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంక్ పోశారు. పాకిస్థాన్ కు సంబంధించిన ప్రతీ ఈవెంట్ ను సేన అడ్డుకుంటుందని స్పష్టం చేసింది. నిరసన కంటిన్యూ చేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. అయితే సుధీంద్ర కులకర్ణిపై ఇంక్ పోయడాన్ని అన్ని పార్టీలు తప్పుబట్టాయి. బీజేపీ సీనియర్ నేత అడ్వానీ కూడా సీరియస్ అయ్యారు.  కాంగ్రెస్ కూడా… శివసేన అరాచకంగా ప్రవర్తిస్తోందని మండిపడింది. పుస్తకం ఆవిష్కరణ టైమ్ లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగలేదు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్… శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో మాట్లాడరని… అందుకే… ఆ పార్టీ ఆందోళన విరమించుకుందని సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy