పుస్తెలపై పుకార్లు : పగడాలు పగలగొడుతున్నారు.. పూసలు తీసేస్తున్నారు

mangalsutraరాష్ట్రంలో సరికొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో మొదలైన ఈ విడ్డూరం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాళిబొట్టులోని పగడాలు మాట్లాడుతున్నాయని.. పుస్తెల తాడులోని పగడాల నుంచి మాటలు వినిపిస్తున్నాయని.. భర్త చనిపోతాడనే వదంతులు వ్యాప్తించాయి. దీంతో మహిళలు తాళిబొట్టులోని పగడాలను తీసి రాళ్లతో పగలగొట్టుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్ పేట మండలాల్లోని గ్రామాల్లో మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ వదంతులు వ్యాపించాయి.

గద్వాల జిల్లాలోనూ..

గద్వాల జిల్లాలోనూ ఇలాంటి వదంతులే హల్ చల్ చేస్తున్నాయి. తొళిబొట్టుకు ఉన్న నల్లపూసల నుంచి మాటలు వినిపిస్తున్నాయని.. అలా వస్తే వెంటనే చనిపోతామని మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గట్టు, వడ్డేపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కొందరు మహిళలు మంగళసూత్రాల్లోని నల్లపూసలు తీసేస్తున్నారు. దీనికి విరుగుడు జాగారం అంటూ బుధవారం చాలా మంది మహిళలు రాత్రంతా నిద్రపోలేదు. ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుని చెప్పుకోవటంతో ఇది అంతకంతకూ దుమారం రేపుతోంది.

కర్ణాటక నుంచి వస్తున్న వదంతులు :

ఈ విషయం స్థానికులు, అధికారులు ఆరా తీయగా.. కర్నాటక రాష్ట్రం ముదేళ్లి, ఇతర ప్రాంతాల నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయని తేల్చారు. ఇదంతా అబద్దమని.. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దని చెబుతున్నారు అధికారులు. ఇలాంటి వదంతులను ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పగడాలు, నల్లపూసలు మాట్లాడటం, వాటి నుంచి శబ్దాలు రావని.. వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy