పూడ్చిన 3 రోజులకు.. ఆ పసికందు బతికాడు

3days babyకన్నతల్లి పూడ్చి పెట్టినా.. పుడమి తల్లి బతికిచ్చింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. పేరెంట్స్ కు తెలిస్తే ఆగ్రహిస్తారని పుట్టిన వెంటనే శిశువును పూడ్చిపెట్టింది. దక్షిణాఫ్రికాలోని క్వాజులు, నాటల్ ప్రావిన్స్ లో ఈ సంఘటన జరిగింది.

25 ఏళ్ల యువతి తను పని చేసే టింబర్ ఫ్యాక్టరీలోనే ఆ బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. 3 రోజుల తర్వాత .. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు పిల్లాడి ఏడ్పు వినబడింది. అనుమానం వచ్చి చూడగా.. ఆ బాలుడు బతికే ఉన్నాడు. తల్లిదండ్రులకు తెలియకూడదనే.. తాను ఈ పనిచేసినట్టు చెప్పుకొచ్చిందా యువతి. ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకకప్పి బాలుడిని పూడ్చివేసిందా తల్లి. మూడు రోజుల తర్వాత  ఆ శిశువు ఏడుపులు వినిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. పోలీసులు ఆ బాలున్ని కాపాడారు.

ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుశ్యర్యకు పాల్పడిన తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy