పూణే ‘టూ’ బెంగళూర్ రూ.1499..

61362563853_625x300తక్కవ కాస్ట్ కే ఫ్లైట్ టికెట్లు అందించే ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసిన ఎయిర్ ఏషియా, మళ్లీ లో కాస్ట్ టికెట్ ను ఎనౌన్స్ చేసింది. 5 వందల కిలో మీటర్లు దూరం ఉన్న పూణే, బెంగళూర్ సిటీల మధ్య  ఫ్లైట్ కాస్ట్ ను రూ.1499లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై పూణేకు కూడా ఎయిర్ ఏషియా ఫ్లైట్లు నడుపుతున్నట్లు కంపెనీ చెప్పింది.  పూణే-జైపూర్ సిటీల మధ్య ఫ్లైట్ కాస్ట్ ను రూ.2999లకే అందిస్తున్నామని కంపెనీ చెప్పింది. ఈ టికెట్ల ఆఫర్లు వచ్చే నెల డిసెంబర్ 17 నుంచి 2015 జనవరి 17 మధ్య ట్రావెల్ చేసే వారికి మాత్రమే పనిచేస్తాయని, నవంబర్ 23లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది. ఎయిర్ ఏషియా ఫ్లైట్లు ఇప్పటి వరకూ బెంగళూర్, కొచ్చి, చెన్నై, ఛంఢీగడ్, జైపూర్, గోవా సిటీల నుంచి మాత్రమే నడుస్తున్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy