పూరితోనే బాలయ్య 101వ చిత్రం

NBKనందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న 101వ సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు బాలయ్య. క్రిష్‌ దర్శకత్వంలో ఆయన చేసిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రజాదరణ పొందింది. శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనా కౌశల్యం అందరిని ఆకట్టుకుంది. కెరీర్‌పరంగా ఆ సినిమాతో ఓ మైలురాయిని అందుకున్న బాలకృష్ణ తర్వాత ఏ సినిమా చేస్తారనే దానిపై రకరకాల వార్తలు వినిపించాయి.

తమిళ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన 101వ సినిమా చేయబోతున్నారంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారమైంది. ‘శాతకర్ణి’ తర్వాత చేసే సినిమాకు పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా బాలయ్య ఖాయం చేశారని తెలుస్తోంది. జగన్ చెప్పిన మాస్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ యాక్షన ఎంటర్‌టైనింగ్‌ స్టోరీ ఆయనకు బాగా నచ్చిందనీ, ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌తోనే ముందుకెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారనీ సినిమా పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనీ, వారిలో నేటి తరం క్రేజీ హీరోయిన్లతో పాటు నిన్నటి తరం తారలూ ఉంటారనీ తెలిసింది. భవ్య క్రియేషన్స పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మహాశివరాత్రి సందర్భంగా ఇవాల వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన 102వ చిత్రంలో నటించే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy