పూరీ – గౌతమ్ ల మ్యాజిక్ మిస్సయిందా?

magic WEBరెండు గన్నులు. రెండు బుల్లెట్లు. ఫ్యాన్స్ గుండెల్లో మాత్రం అదిరే సౌండ్ తో పేలుతయ్. ఇద్దరి స్టైలూ డిఫరెంట్. సినిమా రిలీజ్ అయితే.. ఫ్యాన్స్ కి పండగే. ఒకళ్లు డైలాగ్ ల డైనమైట్ అయితే.. ఇంకొకరు కెమిస్ట్రీకి కేరాఫ్. కానీ వాళ్లిద్దరి మేజిక్కూ సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించట్లేదు. మరి ఆ ఇద్దరి డైరెక్టర్ల కథేంటో ఇప్పుడు చూద్దాం.

వీళ్లిద్దరూ ముదుర్లు. మహా అంటే మహా ముదుర్లు. ఎవరి స్టైల్ వాళ్లది. ఇద్దరికీ సెపరేట్ గా ఫిక్స్ డ్ ఫ్యాన్స్ ఉన్నారు. మూవీ హిట్టూ ఫట్టుతో సంబంధం లేకుండా వెళ్లి థియేటర్ లో కూచుంటారు ఫ్యాన్స్. మిగతా వాళ్లు కూడా బానే యాంగ్జైటీగా వెయిట్ చేస్తారు. కానీ.. ఇప్పుడీళ్లద్దరిలో ఏదో మిస్సింగ్. స్క్రీన్ పై అంతగా వర్కవుట్ కావట్లేదు. చానాళ్ల నుంచి అటీటుగానే ఉంది ప్రజెంటేషన్.

బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క. ఎప్పుడొచ్చామన్నది మేటరే కాదు. ఇదీ డైలాగ్. సిన్మాలో బుల్లెట్లు మామూలే.. చూసే వాళ్లకి మాటల బుల్లెట్లూ మామూలే. ఈ మధ్య గన్నులూ పేలట్లే.. బుల్లెట్లూ దిగట్లే. అప్పుడెప్పుడో బిజినెస్ మేన్ లా బిజినెస్ చేశాడు. ఆ తర్వాత అంతంత మాత్రమే అయిపోయాయి మూవీస్.

director_puri_jagannadh_stills_0102140132_012బిజినెస్ మేన్ తర్వాత మనోడికి మార్కెట్ లేకుండా పోయింది. రాంబాబు ఆవేశం పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇద్దరమ్మాయిలతో ఓ రకంగా బానే నడిచిందీ.. బట్ అంతగా అట్రాక్ట్ చేయలేదు. ఫ్యాన్స్ హార్ట్స్ కొట్టేద్దామని హార్ట్ ఎటాక్ తో వచ్చినా..పర్వాలేదనిపించింది మూవీ. క్లాస్ మూవీగా పేరొచ్చినా.. పూరీ రేంజ్ కీ.. అతని స్టైల్ కి సెట్టవలేదన్నారు. తర్వాత టెంపర్ చూపించాలని ట్రై చేశాడు. బట్ కథ మనోడిది కాదు. డైరెక్షన్, డైలాగుల విషయంలో మంచి మార్కులే పడ్డయ్. తర్వాత జ్యోతిలక్ష్మిని తెరమీదికి తీసుకొచ్చినా.. చార్మీ అందాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. క్లైమ్యాక్స్ లో సినిమా చూపించే పూరీ.. జ్యోతి లక్ష్మి క్లైమ్యాక్స్ ని బొంబై చేశాడని ఫీలయ్యారు ఫ్యాన్స్.

జ్యోతిలక్ష్మి తర్వాత లోఫర్ నంటూ రెడీ అవుతున్నాడు. చిరంజీవి 150వ మూవీ వ్యవహారం డైలమాలోనే ఉంది. పూరీకిస్తారా.. ఇవ్వరా అనేది కూడా కన్ ఫ్యూజనే. పూరీ ఈ కన్ ఫ్యూజన్ లో ఓ నాలుగైదు సినిమాలు ఫట్ ఫట్ తీస్తాడా అంటే అదీ కనిపించట్లే. రెండు మూడు నెల్లలో సినిమాని మడతపెట్టి స్క్రీన్ మీద పెట్టేయడం పూరీ స్టైల్. అంతే కాదు. ఓన్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ ని సెలక్ట్ చేసుకుని డైలాగులతో మంట పుట్టించడం పూరీతో పెట్టిన విద్య. అతని ఓన్ స్టైలాఫ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్.

gautham-vasudev-menon-pkpఇకపోతే. ఎటో వెళ్లిపోయింది మనసు. చూస్తుంటే చాలు. ఎటెటో వెళ్లిపోతుంది. బాల్యంలోకి పోయి.. అలా స్కూల్ ఏజ్ లోకి వెళ్లి.. దాంతర్వాత కాలేజ్ డేస్ లోకొస్తుంది. అదీ మేజిక్కంటే. ఆ మేజిక్ చేసే మొనగాడు గౌతమ్ మీనన్. ఏమైందో కానీ.. కొన్నాళ్ల నుంచి మేజిక్ పెద్దగా కనిపించట్లేదు. అలా అని ఎప్పుడూ హడావిడిగా సిన్మాలు తీసే రకం కాదు గౌతమ్ మీనన్. బట్ ఈ మధ్య చాలా గ్యాపొచ్చింది. సూర్య సన్నాఫ్ క్రిష్ణన్, ఘర్షణ, ఏమాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు గౌతమ్. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమాయ చేశావే మూవీ గురించి. జానర్ వేరైనా.. ఘర్షణ కూడా అంతే. బుల్లెట్ పేలింది. ఎటో వెళ్లిపోయింది మనసు మూవీ హిట్ కాపోయినా.. అందరి మనసునీ తనవైపే తిప్పుకున్నాడు మీనన్. కానీ ఇప్పుడెందుకో సైలెంట్ అయ్యాడు. ఈ జీనియస్ సైలెంట్ అయినా కాపోయినా స్క్రీన్ పై మాత్రం మీనన్ మేజిక్ తగ్గిపోయింది.

లవ్ లో ఉండే ఎమోషన్స్ ని యాజ్ టీజ్ గా స్క్రీన్ పైకి తీసుకొచ్చే సెన్సిటివ్ డైరెక్టర్ మీనన్. అలాగే.. యాక్షన్ మూవీస్ ని కూడా అంతే వైలెంట్ గా చూపించగలడు. ఘర్షణ, రాఘవన్, ఎర్రగులాబీలు చూస్తే మీనన్ అంటే తెలిసిపోద్ది. ఈ మధ్య కూడా అదే స్టైల్ ఆఫ్ జానర్ లో ఎంత వాడు గానీ అంటూ.. తెలుగు తెరపైకి తమిళ్ స్టార్ ని తీస్కొచ్చాడు. కానీ రిజల్ట్ రివర్స్ గేరేసింది. మళ్లీ చానాళ్ల తర్వాత నితిన్ తో కొరియర్ పంపాడు. బట్.. కొరియర్ కూడా అంతే రిటర్న్ అయింది. కొరియర్ బాయ్ కల్యాణ్ మూవీని డైరెక్ట్ చేయలేదు కానీ.. మూవీని ప్రొడ్యూస్ చేసే విషయంలో ఫెయిలయ్యాడని డిసప్పాయింట్ అవుతున్నారు మీనన్ ఫ్యాన్స్.

ఈ డైరెక్టర్లు ఏమాత్రం తగ్గరనేది టాలీవుడ్ కి.. తెలుగు సినిమా ఫ్యాన్స్ కీ అందరికీ తెలిసిన నిజం. లోఫర్ సెట్ లో పూరీ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక మీనన్ కూడా సాహసం శ్వాసగా సాగిపోతున్నాడు. తన స్టైలాఫ్ మూవీతో వస్తున్నాడు. మేనియా వర్కవుట్ అయితే.. ఫ్యాన్స్ కి పండగే మరి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy