పూర్తయిన బీహార్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్

biharఐదు దశల ఎన్నికల్లో భాగంగా… బీహార్ లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పూర్తైంది. 10 జిల్లాల్లోని 49నియోజకవర్గాల్లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 57శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 6.15శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 50.85శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 59.50శాతం మహిళలు ఓటేయగా…54.5 శాతం మంది పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన తారాపూర్, జమల్ పూర్, సూర్యాగ్రాహా, రాజౌలి, గోవింత్ పూర్, సికిందరా, జముయ్,చకాయ్ లో ఓటింగ్ శాతం గతంలో కంటే 10 శాతం పెరిగింది.ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుండగానే.. సెకండ్ ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కంటిన్యూ చేశారు పీఎం మోడీ. జెహనాబాద్, భబువాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న మోడీ..ఆర్జేడీ, జేడీయూలపై డైరెక్ట్ అటాక్ కు దిగారు. బీజేపీ అభివృద్ది ఎజెండాగా పనిచేస్తోందన్న ప్రధాని..ప్రత్యర్థులు మాత్రం మోడీ వినాశనమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక భబువాలో మోడీని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు.

Nitish-Mulayamమరోవైపు.. ఎన్నికలు జరుగుతున్న టైంలో మోడీ ప్రచార సభలకు అనుమతి ఇవ్వొద్దంటూ జేడీయూ.. ఈసీకి ఫిర్యాదు చేయడంపై ఫైరయ్యారు బీజేపీ నేతలు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్రమంత్రులు.. మోడీ సభల లైవ్ టెలికాస్ట్ పై నిషేధం విధించవద్దని కోరారు. సర్వే రిపోర్ట్ లతో టెన్షన్ పడుతున్న బీజేపీకి కాస్త్ బూస్ట్ నిచ్చే విషయం చెప్పారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారన్న ములాయం… బీజేపీ గెలుపుఖాయమన్నారు.  ఇక.. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కావడంతో సెకండ్ ఫేజ్ క్యాంపెయిన్ ను స్పీడప్ చేశాయి పొలిటికల్ పార్టీలు. అటు… అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 16న 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy