పెండింగ్ ఇష్యూస్ తొందరగా తేల్చండి: గవర్నర్

esl-narsimhanరెండు రోజుల ఢిల్లీ టూర్లో బిజీబిజీగా గడిపారు గవర్నర్ నరసింహన్. హస్తిన పెద్దలతో రాష్ట్ర సమస్యలపై చర్చించారు గవర్నర్. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ… హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతో చర్చలు జరిపారు. ప్రధాని మోడీ ఢిల్లీలో లేకపోవడంతో… ఆయన కోసం రోజంతా వెయిట్ చేసి మరీ నిన్న సాయంత్రం కలిశారు. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది.

టూర్లో భాగంగా నిన్న కేంద్ర మంత్రి మనోహర్ పరికర్ తో భేటీ అయ్యారు గవర్నర్ నరసింహన్. రాష్ట్రంలో రక్షణ శాఖ స్థలాలు, కంటోన్మెంట్ ఏరియాల్లో అభివృద్ది కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ ఏరియాల్లో రహదారులు మూసివేత అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక రెండు రోజుల టూర్ లో భాగంగా… సెంట్రల్ కేబినెట్ సెక్రటరీతోనూ గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకం, విభజన చట్టంలోని నైన్త్, టెన్త్ షెడ్యూల్ పై చర్చించినట్లు తెలుస్తోంది. టూ డేస్ ఢిల్లీ టూర్ లో ప్రెసిడెంట్ ప్రణబ్ తోపాటు పలువురు కేంద్రమంత్రులలో స్టేట్ ఇష్యుస్ పై చర్చించారు గవర్నర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy