పెట్రోల్ గన్ దగ్గర స్నేక్

SNAKE WEBపెట్రోల్ రీఫిల్లింగ్ కోసం వెళ్లిన మీకు.. పైప్ దగ్గర స్నేక్ కనిపిస్తే ఎలా ఉంటుంది.. ఈ ఎక్స్ పీరియన్స్ ఒక ఆస్ట్రేలియన్ కు ఎదురైంది. సిడ్నీ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళుతుండగా మధ్యలో పెట్రోల్ రీఫిల్లింగ్ కోసం ఓ బంకులో ఆగాడు. పెట్రోల్ పోసుకోవటానికి.. పైప్ దగ్గర కదలుతూ కనిపించింది. ఏంటా అని పరీక్షగా చూస్తుంటే.. కట్ల పాము కనపడింది. బుస్.. బుస్ అంటూ బుసలు కొడుతోంది. కస్టమర్ షాక్ అయ్యాడు. విషయాన్ని బంక్ లోని సిబ్బందికి చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన సమాధానం విని కస్టమర్ల మళ్లీ షాక్ అయ్యాడు. అవును అక్కడ పాము ఉన్న సంగతి తెలుసునని సమాధానం చెప్పారంట. పెట్రోల్ తోపాటు.. స్నేక్ కూడా ఉందని బోర్డ్ పెట్టండంటూ కొద్దిగా అసహనం వ్యక్తం చేశాడు కస్టమర్. తానో కెమిస్టునని.. ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్నానని.. ఇలాంటి పాములను గతంలో ఎన్నో సార్లు చూసినా.. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. పెట్రోల్ బంక్ పైప్ దగ్గర నుంచి పాము ఉండటాన్ని ఎవరూ ఊహించరని.. అలాంటి చేష్టలు చేయటం తగదని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఇన్సిడెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఆ ఆస్ట్రేలియన్. ఇప్పుడది వైరల్ అయ్యింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy