పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి

petrolపెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి.  రాష్ట్రాలు విధించే సుంకాలు కాకుండా పెట్రోలుపై లీటరుకు రూ.1.39; డీజిల్‌పై లీటరుకు రూ.1.04 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఈ పెంపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్‌లో పెట్రోలు లీటరుకు రూ.1.89; డీజిల్‌ లీటరుకు రూ.1.33 పెరిగాయి. 15 రోజుల కిందటే పెట్రో ధరలను భారీగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గడంతో హైదరాబాద్‌లో పెట్రోలుపై లీటరుకు రూ.5.10; డీజిల్‌పై లీటరుకు రూ.3.68 తగ్గించారు. తాజా సమీక్షలో భాగంగా ధరలను మళ్లీ పెంచారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy