పెట్రోల్ ధరల్లో చిదంబర రహస్యం : ఒక్కో లీటర్ పై రూ.25 తగ్గించొచ్చు

petrol-ratesమీరు బండి తీసుకుని పెట్రోల్ బంక్ క వెళ్లారు.. ఓ లీటర్ కొట్టించారు.. రూ.82 చెల్లించారు.. ఇందులో 25 రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిపోతున్నాయి. మీకు బండి ఉండి.. ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్ కొట్టించినా.. అన్ని 25 రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఖజానాలోకి చేరిపోతున్నాయి. మీరు అప్పు చేసి కొట్టించినా.. క్రెడిట్ కార్డుతో కొట్టించినా.. డెబిట్ కార్డుతో కొట్టించినా.. డబ్బు ఇచ్చి కొట్టించుకున్నా.. ఏ విధంగా అయినా పెట్రోల్ కొట్టించు.. వాళ్ల డబ్బు మాత్రం వాళ్లకు చేరుతుంది. బండిలో పడే పెట్రోల్ లో దోపిడీ మాత్రం వాళ్లకు అనవసరం. రీడింగ్ ప్రకారం వెళ్లిపోతున్నాయి అంటూ రహస్యాన్ని చెప్పేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక, హోం మంత్రి చిదంబరం. ఆయన చేసిన ఓ ట్విట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ రూ.82కి చేరింది. వాస్తవానికి ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. అప్పుడు కూడా కేంద్రం ధరలు తగ్గించలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించనప్పుడు కేంద్రం ఒక్కో లీటర్ పెట్రోల్ పై అదనంగా రూ.15 వసూలు చేసింది. దీనికి అదనంగా మరో రూ.10 పన్నుల రూపంలో వాత పెట్టింది. ఈ మొత్తం రూ.25. రెండేళ్ల పాటు దేశంలోని ప్రతి లీటర్ పెట్రోల్ నుంచి ఇలా రూ.25 వసూలు చేసిందని చిదంబరం ట్విట్ చేశారు. వాస్తవంగా రూ.15 వాహనదారుడికి చెందాల్సి ఉంది.. కేంద్ర ప్రభుత్వం అలా చేయలేదు. వాహనదారుల నుంచి వసూలు చేసి ఖజానాలో వేసుకుంది. ఇప్పుడు క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ఆ రేటుకి వసూలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు కూడా కేంద్రం తలచుకుంటే.. ప్రజలపై ప్రేమ ఉంటే.. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గించొచ్చు అన్నారు. కానీ ప్రభుత్వం అలా చేయటం లేదని.. 2, 3 రూపాయలు తగ్గిస్తూ వాహనదారులను మోసం చేస్తుందంటూ ట్విట్ పెట్టారు. ఇది కేంద్రానికి ఎంత మాత్రం భారం కాదని వివరించారు. ధర తగ్గినప్పుడు వసూలు చేసిన రూ.15 ఎటూ వాహనదారులకే తిరిగి ఇవ్వొచ్చు అని.. పన్నులు తగ్గించుకుంటే మరో రూ.10 ధర తగ్గుతుందని వెల్లడించారు. చిదంబరం ట్విట్ తో రహస్యం వీడిందని.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy