పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంపు

PETROLకేంద్రం…న్యూ ఇయర్ వాతలు పెట్టింది. పెట్రో డీజిల్ ధరల్ని..ప్రజలకు తెలియకుండానే పెంచేసింది. కొత్త ఏడాదికి ఒక్క రోజు ముందు…పెట్రో డీజిల్ రేట్లు స్వల్పంగా తగ్గించి..రెండు రోజుల తర్వాత ఎక్సైజ్ డ్యూటీ వడ్డింపులు చేసింది. లీటర్ పెట్రోల్ పై 37 పైసల ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్రం..డీజిల్ పై ఏకంగా లీటర్ కు 2 రూపాయలు వడ్డించింది. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో…ఏడాదికి 4వేల4వందల కోట్లకు టెండర్ పెట్టింది కేంద్రం. తాజా హైక్ తో డీజిల్ పై 4వేల3వందల కోట్లు, పెట్రోల్ పై దాదాపు వంద కోట్లు కేంద్రం ఖాతాలో పడనున్నాయి. ఎక్సైజ్  డ్యూటీ గతంలో 19రూపాయల 6పైసలు ఉండేది. డిసెంబర్ 17న 30 పైసలు పెంచారు. ఇవాళ మరోసారి 37 పెంచింది. టోటర్ గా లీటర్ పెట్రోల్ పై  19రూపాయల 73పైసల ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది కేంద్రం. డీజిల్ పై గతంలో 4.66 పైసలుంటే డిసెంబర్ 17న రూపాయి 17పైసలు పెంచింది. ఇవాళ మరోసారి  రెండు రూపాయలు పెంచింది. మొత్తంగా లీటర్ డీజిల్ పై  7.83 పైసల ఎక్యైజ్ డ్యూటీని కలెక్ట్ చేస్తోంది. పెట్రోడీజిల్ ..లీటర్ లెక్కలు చూస్తే…రిఫైనరీ అండ్ ట్రాన్స్ పోర్ట్ ఖర్చు..6 రూపాయలు, డీజిల్ కైతే 4రూపాయల 60పైసలు. ఆయిల్ కంపెనీల మార్జిన్ పెట్రోల్ కు రూ.3.90 పైసలు, డీజిల్ కు 2.10 పైసలు. డీలర్ కమిషన్ పెట్రోల్ కు  2.27 పైసలు..డీజిల్ కు రూపాయి 47 పైసలు. అన్ని లెక్కల్ని కలుపుకుంటే…లీటర్ పెట్రోల్ పై కేంద్రం 31రూపాయల90 పైసలు, డీజిల్ పై లీటర్ కు 15రూపాయల 95 పైసలు వసూలు చేస్తోంది. వీటికి  తోడు వ్యాట్ వడ్డింపులు ఉండనే ఉన్నాయి. గతంలో 31 శాతమున్న వ్యాట్ ను..తెలంగాణ సర్కార్ 35.20కి పెంచింది. డీజిల్ పై 22.25 ఉంటే…27 శాతానికి పెంచింది.  మోడీ సర్కార్..నవంబర్ 2014 నుంచి..ఇప్పటి వరకు 4సార్లు ఎక్సైజ్ డ్యూటీపెంచింది.  నాలుగు సార్లు  పెంపుతో….దాదాపు 20వేల కోట్ల ప్రజాల సొమ్ముకు కౌంటర్ పెట్టింది కేంద్రం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy