పెట్రో, డీజిల్ మంట : 20 నుంచి దేశవ్యాప్తంగా లారీల బంద్

దేశంలో ప్రధానమైన రవాణా రంగం సమస్యలతో రగులుతోంది. రవాణా రంగాన్ని ఆదుకోవాలని లారీల యజమానులు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టినా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జూలై 20 ఉదయం 6 గంటల నుంచి దేశ వ్యాప్తంగా లారీల నిరవధిక బంద్‌ కు పిలుపునిచ్చింది ఆలిండియా మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్.
ఈ సమ్మెతో దేశ వ్యాప్తంగా 90 లక్షల లారీలు నిలిచిపోనున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ లో చమురు రేటు తగ్గినా దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి. దీంతో రవాణా రంగంపై పెను భారం పడుతోంది. దేశంలో ఈ ధరలు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. వాహనాల బీమా ప్రీమియాన్ని ఇష్టారాజ్యంగా పెంచడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది అసోసియేషన్.  దేశవ్యాప్తంగా చేపట్టే నిరవధిక బంద్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy