ఎన్నికలు ముగిశాయి.. మళ్లీ పెట్రో రేట్లు పెరుగుతున్నాయ్!

పెట్రో రేట్లకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఎన్నికల టైమ్ లో చమురు ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఎన్నికలు ముగిశాయో లేదో.. మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాయి. వరుసగా రెండు నెలల పాటు నేలచూపులు చూసిన పెట్రో ధరలు.. ఎన్నికలు ముగిశాయో లేదో మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినంతకాలం పెట్రోల్, డీజిల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఫలితాలు విడుదలైన తర్వాత డిసెంబర్ 11 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో కర్ణాటక ఎన్నికల టైమ్ లోనూ ఇలాగే జరిగింది. ఇపుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల టైమ్ లోనూ ఇలాగే జరగడం జనాలను పరేషాన్ చేస్తోంది.

హైదరాబాద్ లో అక్టోబర్ 16న లీటర్ పెట్రోల్ 87.81 గా ఉండేది. అక్టోబర్ 17న ధరలో మార్పులేదు. అక్టోబర్ 18 నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో ఒకట్రెండు రోజులు ధరల్లో మార్పు లేకపోయినా… పెట్రో రేట్లు మాత్రం పెరగలేదు. డిసెంబర్ 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు వరకు… పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతూనే వచ్చాయి. ఫలితాలు  డిసెంబర్ 11న హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేట్ రూ.74.44గా ఉంది. డిసెంబర్ 12న మార్పు లేదు. డిసెంబర్ 13న 11 పైసలు పెరిగింది. డిసెంబర్ 14న మార్పులేదు. డిసెంబర్ 15న 5 పైసలు పెరిగింది. డిసెంబర్ 16న మార్పు లేదు. డిసెంబర్ 17న అంటే ఇవాళ సోమవారం ఇరవై పైసలు పెరిగింది. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.74.80గా ఉంది. అక్టోబర్ 17 నుంచి…. డిసెంబర్ 17 వరకు.. రెండు నెలల్లో లీటర్ పెట్రోల్ ధర 13 రూపాయల 37 పైసలు తగ్గింది.

అలాగే.. హైదరాబాద్ లో లీటర్ డీజిల్ రేట్ ఇవాళ రూ.70.07గా ఉంది. అక్టోబర్ 17న లీటర్ డీజిల్ హైదరాబాద్ లో రూ.82.33 గా ఉంటే… డిసెంబర్ 16 వరకు రూ.69.97వరకు తగ్గింది. డిసెంబర్ 17నాటికి హైదరాబాద్ లో లీటర్ డీజిల్ రేట్ 10 పైసలు పెరిగి రూ.70.07గా ఉంది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 19 పైసలు పెరిగి రూ.70.53గా ఉంది. లీటర్ డీజిల్ 9 పైసలు పెరిగి.. రూ.64.47 గా ఉంది.

బెంగళూరులో లీటర్ పెట్రోల్ 19 పైసలు పెరిగి రూ.71.10గా ఉంది. లీటర్ డీజిల్ 9 పైసలు పెరిగి రూ.64.82గా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ రేట్ 19 పైసలు పెరిగి… రూ.76.15గా ఉంది. లీటర్ డీజిల్ 9 పైసలు పెరిగి రూ.67.47గా ఉంది.

గడిచిన 3 నెలల్లో హైదరాబాద్ లో పెట్రోల్ రేట్ల ట్రెండ్ ఎలా ఉందో కింద గ్రాఫ్ చూస్తే తెలిసిపోతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy