పెత్తనం మాదే : ఎర్రకోటను దత్తత తీసుకున్న దాల్మియా గ్రూప్

redఢిల్లీలోని ఎర్రకోటను దత్తత తీసుకుంది ప్రముఖ వ్యాపార దిగ్గజం దాల్మియా గ్రూప్. మొఘల్ కాలం నాటి ఈ చారిత్రక కట్టడాన్నిరూ.25 కోట్లకు ఐదేళ్ల పాటు దత్తత తీసుకునేందుకు ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టుపై దాల్మియా గ్రూప్ సంతకాలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన “అడాప్ట్ ఎ హెరిటేజ్” స్కీమ్ కింద దాల్మియా ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ స్కీమ్ లో భాగంగా రెడ్ ఫోర్టుని దత్తత తీసుకొనేందుకు వారం రోజుల క్రితమే దాల్మియా భారత్ లిమిటెడ్ టూరిజమ్ మినిస్ట్రీతో MOU కుదుర్చుకుంది. నిర్వహణ బాధ్యతలు చేపట్టటంతోపాటు మరింత మంది పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దనున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పాటు ఎర్రకోట నిర్వహణ భాధ్యతలు అన్నింటినీ దాల్మియా గ్రూప్ తీసుకుంటుంది. ఈ చారిత్రక కట్టడాన్ని దత్తతను దాల్మియా గ్రూప్ కి ఇవ్వటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రెడ్ ఫోర్ట్ తర్వాత బిజేపీ ప్రభుత్వం పార్లమెంట్, లోక్ కళ్యాణ్ మార్గ్, సుప్రీంకోర్టుని కూడా ఫ్రైవేట్ కంపెనీలకు లీజుకిస్తారా అని ట్వీట్ చేసింది కాంగ్రెస్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy