పెద్దగట్టులో జన జాతర

JASTASRAసూర్యాపేట జిల్లాలోని దురాజ్ పల్లిలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క, సారలమ్మ తర్వాత.. రాష్ట్రంలోనే అతిపెద్ద జాతర పెద్దగట్టు. ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులు ఈ వేడుక జరగనుంది. అర్థరాత్రి నుంచే లక్షల మంది భక్తులు తరలివచ్చారు. 30 నుంచి 35 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ జాతర నిర్వహిస్తోంది. ఏర్పాట్ల కోసం రూ.2కోట్లు కేటాయించింది. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, కర్నాటక నుంచి రానున్నారు. శివుడుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. యాదవులు, గొల్ల, కురమలు తరలివస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్రమంత్రులు, జగదీశ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ప్రత్యేక బస్సులు :

లింగమతుల జాతరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి బస్సులు నడుస్తున్నాయి. సూర్యాపేట పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పొట్టి శ్రీరాములు సెంటర్, సూర్యాపేట-ఖమ్మం క్రాస్‌రోడ్డు, జమ్మిగడ్డ నుంచి బస్సులను నడుపుతున్నారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy