పెద్దపల్లి ఎస్సై ఆత్మహత్య

SISUSIDE12కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సైగా పనిచేసిన జగన్ మోహన్… పోలీస్ క్వార్టర్ లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 2007 ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, నర్సాపూర్ జీ SI గా పని చేశారు. ఆతర్వాత ధర్మపురి ASI గా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పని చేశారు. 2015 జనవరిలో పెద్దపల్లి SI గా బాధ్యతలు తీసుకున్నారు.రీసెంట్ గా జరిగిన ట్రాన్స్ ఫర్ లో జగన్మోహన్… పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు బదిలీ అయ్యారు. మరో మూడు నెలల్లో సీఐగా ప్రమోషన్ వచ్చే సమయంలో…బదిలీ చేయడంపై తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. దీంతో సూసైడ్ నోట్ రాసి… పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్. జగన్మోహన్ ది కరీంనగర్ లోని విద్యానగర్. డ్యూటీలో సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్నారు జగన్మోహన్. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఘటనా స్థలాన్ని ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. జగన్మోహన్ సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy