పెద్దల పుట్టినరోజులకు సెలవులు రద్దు

yogi-adityanathసంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ మరో షాక్ ఇచ్చారు. మహనీయుల జయంతి, వర్ధంతుల రోజుల్లోని సెలవు దినాలను రద్దు చేశారు యోగి. తన పాలనలో చేసే సవరణలకు కొంత మంది వ్యతిరేకత తెలిపినా వాటిని అమలు చేయడంలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. పిల్లలకు ఈ దేశ నేతల గురించి తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలే కానీ.. సెలవులు ప్రకటిస్తే ఆ రోజును పిల్లలు ఆదివారంగా పరిగణిస్తున్నారని తెలిపారు. భీమ్ రావ్ అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. సాధించిన ఘనతను చిన్నవయస్సులోనే తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం స్కూళ్లు  ప్రభుత్వ రూల్స్ ప్రకారం 220 రోజులు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 120 రోజులు కూడా సరిగ్గా జరగటం లేదని.. ఇలా అయితే రానున్న రోజుల్లో వర్కింగ్ డేస్ జీరో అవుతాయన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy