పెద్ద‌గాలికి కూలిన 17వేల ట‌న్నుల యంత్రం

oil 2స్కాట్‌లాండ్ దేశానికి ప‌శ్చిమంగా చాలా దీవులున్నాయి. ఆ దీవుల్లో ఆయిల్‌కూడా విరివిగా దొరుకుతుంది. ఆయిల్‌ను తోడేందుకు 17వేల ట‌న్నుల బరువున్న ఒక యంత్రాన్ని  అక్క‌డ ఏర్పాటు చేశారు. అయితే ఒక పెద్ద‌గాలి వీయ‌డంతో ఆ యంత్రం స‌ముద్ర‌పు తీరానికి కొట్టుకువ‌చ్చింది. డాల్మోర్ అనే ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  ఆ పెద్ద‌గాలుల‌కు ఆయిల్ తోడే ప‌రిక‌రం చీల‌డంతో స‌ముద్రంలోకి నూనె ఒలికి నీటిలో క‌లిసే అవ‌కాశం ఉండ‌టంతో చ‌ర్య‌లు చేప‌ట్టారు అధికారులు. అయితే వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో ప‌నుల‌కు ఆటంకంగ మారింది. గ‌త‌నెల‌లో చివ‌రిసారిగా ఈ యంత్రాన్ని వాడి ఆయిల్ తీసిన‌ట్లు అధికారులు చెప్పారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింద‌ని వారు వివ‌రించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy