పెద్ద ప్రమాదం తప్పింది : వెనుజులా అధ్యక్షుడిపై డ్రోన్లతో ఎటాక్

వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురోపై శనివారం హత్యయత్నం జరిగింది. శనివారం(ఆగస్టు-4) నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమంలో పాల్గొన్న నికోలస్…. ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ల దాడి జరిగింది. నికోలస్ ఉన్న ప్రాంగణంలోనే…. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు పేలాయి. ఈ డ్రోన్ల దాడి నుంచి అధ్యక్షుడు నికోలస్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్ధానిక మీడియా తెలిపింది. ఈ డ్రోన్ల దాడిలో ఏడుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ డ్రోన్ల దాడి నికోలస్ మాదురో లైఫ్ పై జరిగిన దాడిగా వర్ణించారు వెనుజులా కమ్యూనికేషన్స్ మినిస్టర్ జార్జ్‌ రోడ్రిగోజ్‌. ఈ డ్రోన్ల దాడి ఖచ్చితంగా పొరుగు దేశమైన కొలంబియా, కొంతమంది అమెరికా ఫైనాన్సర్లు పనేనని అన్నారు అధ్యక్షుడు నికోలస్ మాదురో. ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy