పెద్ద స్కెచ్ వేశారు : తెలంగాణ ఉద్యోగ జీవోతో ఆంధ్రలో మోసం

jobsతెలంగాణ జీవో అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో భారీ మోసానికి తెర తీశారు కొందరు కంత్రీగాళ్లు. తెలంగాణ ప్రభుత్వ జీవోలను మార్చి.. ఆంధ్రలోని నిరుద్యోగులకు బురిడీ కొట్టించటానికి వ్యూహం పన్నారు. పకడ్బందీగా అన్ని మార్చేశాం అనుకున్న వారు.. ఒకే ఒక్క విషయంలో దొరికిపోయారు. ఏపీ సీఎం ఆఫీస్ కు వచ్చిన సమాచారంతో పెద్ద మోసానికి అడ్డుకట్ట పడింది అంటున్నారు అధికారులు. వివరాల్లోకి వెళితే..

2017, జూలై 7వ తేదీన తెలంగాణ ఆర్థిక శాఖ ఓ జీవో రిలీజ్ చేసింది. 1506 డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తాహశీల్దార్ల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసుకోవటానికి అనుమతి ఇస్తూ.. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఎన్.శివశంకర్ సంతకంతో ఈ జీవో విడుదల అయ్యింది. ఈ జీరో వెబ్ సైట్ లో కూడా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు కంత్రీగాళ్లు వెబ్ సైట్ నుంచి ఈ జీవోను డౌన్ లోడ్ చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థానం ఆంధ్రప్రదేశ్ అని మార్చారు. తేదీని యథాతథంగా ఉంచారు. ఎక్కడెక్కడ అయితే తెలంగాణ అని ఉన్నదో అక్కడ ఆంధ్రప్రదేశ్ అని.. హైదరాబాద్ స్థానంలో విజయవాడ అని మారుస్తూ జీవోను నకిలీ చేశారు. ఈ జీవో చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ ఏపీలోని నిరుద్యోగులకు వల వేశారు.

ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు నాలుగు లక్షలు.. డిప్యూటీ తాహశీల్దార్ కు మూడు లక్షలు అని రేటు కట్టి వసూళ్లకు దిగారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ నకిలీ జీవోతో ప్రచారం చేశారు. దీని పరిశీలించిన ఓ నెటిజన్.. అనుమానం వచ్చి ఈ జీవో కాపీని ఆంధ్రప్రదేశ్ సీఎంవో ఆఫీస్ కు సమాచారం ఇచ్చాడు. ఉద్యోగ భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని స్పష్టం చేసింది. సెక్రటరీ ఎన్.శివ శంకర్ ఆర్థిక శాఖలో ఎవరూ లేరని.. ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో అని.. ఈ సంతకం ఆధారంగా నకిలీ అని తేల్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ నకిలీ జీవోతో మోసపోయినట్లు ఎలాంటి కంప్లయింట్ రాలేదని చెబుతున్నారు ఏపీ అధికారులు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విరివిగా విడుదల చేస్తున్న జీవోలను మార్ఫింగ్ చేసి నకిలీవి సృష్టిస్తున్నారని.. వీటిపై అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అసలు – నకిలీ జీవోలను గుర్తించటం కోసం సంబంధిత ప్రభుత్వం వెబ్ సైట్లకు వెళ్లి సరిచూసుకోవాలని నిరుద్యోగులకు సూచిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy