పెరిగిన పొల్యూషన్..రెండో అలర్ట్ ప్రకటించిన బీజింగ్

beijingబీజింగ్ ఎయిర్ పొల్యుషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. వారం క్రితమే డిసెంబర్ 8 నుంచి 10 వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈసారి ఎయిర్ పొల్యుషన్ డబుల్ అయింది. అందుకే నాలుగురోజులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బీజింగ్ ఎయిర్ పొల్యుషన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పొగమంచు డ్రాగన్స్ ని భయపెడుతోంది. రెండోసారి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఆందోళన మరింత పెరిగింది. రెడ్ అలర్ట్ తో బీజింగ్ లో… 3 వేల 200 స్కూళ్లు మూతపబోతున్నాయి. ఆడ్-ఈవెన్ ఫార్ములాతో సగానికి పైగా వెహికిల్స్ రోడ్డెక్కవు. పరిశ్రమలు మూసేస్తారు. నిర్మాణ రంగం నాలుగు రోజులు బంద్. ఇలా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం వల్ల ఎయిర్ పొల్యుషన్ కంట్రోల్ లోకొస్తుందని భావిస్తున్నారు. గతవారం రెండురోజుల రెడ్ అలర్ట్ తో చాలావరకు పొగమంచు మాయమైంది. కానీ అంతలోనే మళ్లీ చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం వాతావరణంలో ఉండాల్సిన స్థాయికన్నా…. బీజింగ్ లో 6 వందల రెట్లు విషవాయువులు ఎక్కువని తేలింది. అభివృద్ధి ముసుగులో జరిగిన ప్రకృతి విధ్వంసంతో… బీజింగ్ లో బతకడం దుర్భరం అని ఎన్నో నివేదికలు స్పష్టం చేశాయి. వరల్డ్ లోనే వరెస్ట్ వెదర్ బీజింగ్ సొంతమని ప్రతీ నివేదికా చెప్పింది. అయినా చైనా పాలకులు చెవికెక్కలేదు. గత వారం కళ్లుతెరిచిన చైనా పాలకులు.. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇపుడు మరోసారి రెడ్ అలర్ట్ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. నిజానికి గతవారం అలర్ట్ తో బీజింగ్ లో చాలావరకు ఎయిర్ పొల్యుషన్ కంట్రోల్ లోకొచ్చింది. కానీ సౌత్ చైనాలోని హెబీ(Hebei), హెనన్(Henan), షాంగ్జై(Shanxi) ప్రావిన్స్ ల నుంచి భారీగా విషవాయువులు విడుదలవుతున్నాయి. బీజింగ్ లో ఎంత కంట్రోల్ చేసినా మిగతా నగరాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. దీంతో మరోసారి రెడ్ అలర్ట్ తప్పలేదు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy