పెరుగుతున్న ఎండలు : ప్రాణాలు విడుస్తున్న మూగ జీవాలు

DEATHనీటికష్టాలు  మనుషులకే కాదు .. అడవుల్లోని  వన్యప్రాణులకు  తప్పడం లేదు . అడవుల్లో  స్వేచ్ఛగా  తిరగాల్సిన జంతువులు.. నీటికోసం  బిక్కుబిక్కుమంటున్నాయి. ఎండతీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నాయి.  దీంతో  అడవుల్లోని  వన్యప్రాణులను  కాపాడేందుకు  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  అటవీశాఖ అధికారులు  చర్యలు చేపట్టారు.  జంతువుల  దాహాం తీర్చేందుకు  అడవిలో  నీటి  సాసర్స్ ఏర్పాటు  చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీశాఖ అధికారులు వన్య ప్రాణులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. మండుతున్న ఎండలతో అడవుల్లోని వాగులు, కుంటలు ఎండిపోయి తాగునీరు దొరకక వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. అందుకే అడువుల్లో నీటి సాసర్స్ ఏర్పాటు చేసి అందులో నీటిని నింపుతూ వన్యప్రాణుల దాహం తీరుస్తున్నారు.

వన్య ప్రాణులు నీటిని తాగుతున్నాయా లేక సాసర్స్ లో నీరు వృధాగా పోతున్నాయా తెలుసుకునేందుకు నీటిసాసర్స్ దగ్గర చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రకరకాల వన్య ప్రాణులు నీటి సాసర్స్ దగ్గరకు వచ్చి నీటిని తాగుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నీళ్లు లేక మూగ జీవాలు చనిపోకూడదనే ఉద్దేశంతో సమ్మర్ లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వన్య ప్రాణులను కాపాడుకునేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన నీటి సాసర్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అడవీలో నీరు దొరకక పోవడంతో మూగ జీవాలు నీటి సాసర్స్ దగ్గరకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. అధికారులు కూడా నీటిని ట్యాంకర్లతో తెప్పించి ఎప్పటికీ నీటినిఅందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఎండలకు అడవీలోని చెట్లు ఎండిపోవడంతో వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్నాయి. ఓవైపు నీడలేక మరోవైపు నీళ్లులేక వాటిని కాపాడేందుకు ఫారెస్ట్ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy