పెర్త్ వన్డే ఆస్ట్రేలియా సొంతం

Australia v India - Game 1ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియాకు ఫస్ట్ పంచ్ పడింది. పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ విసిరిన 310 రన్స్ లక్ష్యాన్ని మరో నాలుగు బాల్స్ మిగిలి ఉండగానే కంగారూలు ఛేదించారు. భారత బౌలింగ్ లో పస లేదని తేల్చేశారు. కెప్టెన్ స్మిత్, బెయిలీ .. ఇద్దరూ సెంచరీలు కొట్టారు. ఆస్ట్రేలియాకు ఈజీగా విక్టరీని అందించారు. భారత బౌలర్లు, ఫీల్డర్లను పరుగులు పెట్టించారు. కెప్టెన్ స్మిత్ 149 …. బెయిలీ 112 రన్స్ చేశారు. ఓవరాల్ గా 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 రన్స్ టార్గెట్ ను ఆస్ట్రేలియా రీచ్ అయింది.

అంతకుముందు..  టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ గ్యాంగ్ కూడా బాగానే ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ సూపర్బ్ గా ఆడారు.  ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్న ఓపెనర్ రోహిత్ శర్మ… రికార్డులు తిరగరాశాడు. 171 రన్స్ తో నాటౌట్ గా నిలిచి… ఆస్ట్రేలియా గడ్డపై హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ… 91 పరుగులు చేసి రోహిత్ కు సాయమందించాడు. ఓవరాల్ గా 50 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 309 రన్స్ చేసింది. ఐదు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ ఓడినా… తమ బ్యాటింగ్ తో అభిమానులను ఆకట్టుకుంది. వచ్చే మ్యాచ్ లో బౌలింగ్ ను మరింత మెరుగుపర్చుకుంటామని కెప్టెన్ ధోనీ చెప్పాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy