పెళ్లికి ముందే ఇల్లు కావాలంటున్న అమ్మాయిలు

Untitled-12పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు.. ఇది పెద్దల మాట. నేటి తరం దీనికి రివర్స్. ముందు ఇల్లు .. ఆ తర్వాతే పెళ్లి అంటున్నారు. ముఖ్యంగా యువతులైతే నేను.. నేటి మహిళను అంటూ …. ఆచరణలో చేసి చూపెడుతున్నారు. పెళ్లికి ముందే సొంతింటిలోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది.

బంగారం… పట్టుచీరలు. అంటే ఫ్లాటయ్యే మహిళలు బాగా తగ్గారు. ముందు సొంతిల్లు.. తర్వాతే అలంకారాలు అంటున్నారు. పెళ్లికి ముందే సొంతింటి కల సాకారం చేసుకుంటునేందుకు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఏ మాత్రం వెనకడ్డాం లేదు యంగ్ విమెన్. భర్తపై నమ్మకం లేకో.. వచ్చేవాడు ఎలా ఉంటాడో అన్న భయమోగానీ.. ఇవాళ్టి యంగ్ అండ్ ఎర్నింగ్ వుమెన్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగమో, సొంత వ్యాపారమో చేస్తున్న పెళ్లికాని యువతల్లో  చాలమంది ఇప్పడు ఇలాగే ఆలోచిస్తున్నారు.  తమ పెళ్లి తల్లి తండ్రలకు భారం కాకుడదనుకుంటున్నారేమో.. సంపాదించిన డబ్బును ఏ బ్యాంక్ లోనో డిపాజిట్ చేయకుండా ఏకంగా రియల్ ఎస్టెట్ లో పెట్టబడి పెడితే భారిగా లాభాలు వస్తాయని అంచనా కావచ్చు వారిని  ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రోత్సహిస్తున్నాయని రియాల్టీ నిపుణులు చెపుతున్నారు.

యంగ్ విమెన్ ఆలోచనలను వారి తల్లి తండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. కూతురు సంపాదన అమెకే ఉపయోగపడతే అంతకన్నా  సంతోషమేముందటున్నారు. పెళ్లయిన తరువాత అత్తగారి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము కదా.. ఎంతో కొంత అమే పేరున ఉంటే ఎందుకైన మంచిదన్నది వారి అభిప్రాయం

ఉద్యోగం చేయడానికే భయపడే స్థాయి నుంచి ఇప్పుడు భర్తనే పోషించడానికి వెనకాడటంలేదు. పెళ్లి తర్వాత సంపాదనను భర్త చేతిలోనో లేక  అత్త, మామ చేతిలోనో పెట్టడానికి వీరు ఇష్టపడటం లేదు. ఈ ఇల్లు నాది.. అని నలుగురిలో గర్వంగా చెప్పుకునేందుకు సిద్దపడుతున్నారు. అత్తారింట్లో కూడా వ్యక్తిత్వం నిలుపుకునేందుకు ఇదో అవకాశంగా భావిస్తోంది నేటి యువ మహిళ. ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కావచ్చు, ప్రైవేటు రంగంలో అందివస్తన్న అవకాశాలు కావచ్చు డిగ్రి పట్టా పుచ్చుకున్న యువతులు పెళ్లికి తొందరెందుకు అంటూ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. యువకుల కంటే యంగ్ వుమెన్ రెండు రెట్లు అకింతభావంతో పనిచేస్తారని పలు సర్వేలో తేలింది. దీంతో ప్రవేటు యాజమాన్యాలు కొన్ని ఉద్యోగాలు ప్రత్యేకించి మహిళలకే కేటాయిస్తున్నారు. లక్షల్లో జీతం వచ్చే సీనీయర్ మేనేజర్ స్థాయిలో యంగ్ అండ్ డైనమిక్ వుమెన్ ను తీసుకునేందుకు కూడా కంపెనీలు వెనకాడటం లేదు.

నెల నెలా వచ్చే జీతంలో.. ఎంజాయ్ చేయడానికి యువకులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. యువతులు మాత్రం సేవింగ్స్ వైపు మొగ్గచూపుతారని ఓ ఫైనాన్షియల్ సర్వేలో తేలింది. సేవింగ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కవ వస్తుందనే విషయంలో యువకుల కంటే యువతులే ఓ అడుగు ముందే ఉన్నారు. మారుతున్న ట్రెండ్ ను గమనించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు యంగ్ ఎర్నింగ్ విమెన్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఒకరికి ఫ్లాట్ అమ్మితే.. వారి స్నేహితులూ ముందుకొస్తుండటంతో పెద్ద పెద్ద రియాల్టీ సంస్థలు స్పెషల్ స్కీంలతో గాలం వేస్తున్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ విడుదల చేసిన వివిరాల ప్రకారం అయిదేళ్ల క్రితం వరకు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే సింగిల్ వుమెన్ కస్టమర్ బేస్ అసలే లేదు. ఇప్పుడు అస్సెట్ క్రియేషన్ పై సీరీయస్ గా దృష్టి పెట్టన యువతుల కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో వీరి శాతం ఐదుకు చేరింది. ఇది త్వరలోనే 10 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా.

గతంలో స్థిరాస్తి రంగంలో లోన్ అప్లై చేసే యువతులకు బ్యాంకులు అంతంగా ప్రాధన్యత నిచ్చేవి కావు. కాని ఇప్పుడు ఫస్ట్ ఫ్రయార్టీ సింగిల్ లేడీస్ కే ఇస్తున్నాయి.. తీసుకున్న హౌసింగ్ లోన్స్  ఇన్ స్టాల్ మెంట్ల చెల్లించడంలో డిఫాల్ట్  కాకపోవడంతో బ్యాంకులు పెద్దగా ఆంక్షలు లేకుండానే సులభంగా వీరికి లోన్ ఇచ్చేస్తున్నాయి. మరో పక్క మహిళలకు వడ్డీ రాయితీ కూడా ఉండటంతో పెళ్లి కాని యువతులు సొంతింటి కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చిన్న కుటుంబం చింత లేని కుంటుంబం అంటారు. కానీ, చిన్న కుటుంబానికి కూడా చికాకులూ తక్కువేం లేవు.. ఎక్కువే. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావటంతో.. ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. ఇది ఏ నిమిషంలో డైవర్స్ కు దారితీస్తుందో అనేది నేటి మహిళలో ఉన్న భయం. ఇదే భయం వాళ్లను సొంతింటి వైపు నడిపిస్తుంది. సంపాదించింది ఇంటిపై పెడితే.. భవిష్యత్ కు ధీమా అనే భరోసాగా భావిస్తున్నారు మహిళలు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy