పెళ్లి కొడుకు ముందే.. వధువు మెడలోకి పూలమాల విసిరిన లవర్

LOVERప్రేమించిన అమ్మాయికి సడెన్ షాక్ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు సినిమా స్టయిల్‌ లో అందర్నీ సర్‌ ప్రైజ్ చేశాడు. పెళ్లి వేడుకలో స్టేజ్ మీద ఉన్న వధువుకు.. ఓ అబ్బాయి సడన్‌ గా వచ్చి మెడలో పూలమాల వేశాడు. పక్కనే పెళ్లి కొడుకు ఉన్నా అతనేమీ చేయలేకపోయాడు. ఈ ఘటన నగీనా జిల్లాలో జరిగింది. 24 ఏళ్ల రాహుల్.. పెళ్లి జరుగుతున్న వేడుక దగ్గరకు బైక్ మీద వచ్చాడు. ఆ తర్వాత స్టేజ్‌ కు కొంచం దూరం ఉన్న అతను.. తన చేతిలో ఉన్న పూలమాలను తీసి వధువు వైపు విసిరాడు. ఆ మాల డైరెక్ట్ గా వెళ్లి పెళ్లి కూతురు మెడలో పడింది. దీంతో అక్కడున్న విజిటర్స్ అందరూ స్టన్ అయ్యారు. పెళ్లి కూతురు కూడా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి తన మెడలో ఉన్న పూలమాలను అతని మెడలో వేసింది. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు అతిథులకు టైం పట్టింది. అయితే వధువు తరపున బంధువులు వచ్చి ఆ అబ్బాయిని చితకబాదారు. వరుడు తరపున బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇక పోలీసులు వచ్చి ఆ అబ్బాయిని అరెస్టు చేశారు. అమ్మాయి దళితురాలు కాగా, అబ్బాయి ఉన్నత కులానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy