పెళ్లి చేసుకొని సాకుతుంది: నా భర్తే ఆవుగా పుట్టాడు

cowపెళ్లి అంటే ఏడు అడుగులు..మూడు ముళ్లు..ఇద్దరి మనసులు..ఒక జీవితం. తన చివరి శ్వాస వరకు తోడుంటానని ఒకరికొకరు ప్రమాణం చేసుకోవడమే పెళ్లి. భారతదేశంలోని ఈశాన్యరాష్ట్రమైన కాంబోడియాలో కిమ్ హాంగ్ అనే వృధురాలికి 74 ఏళ్లు..మరణమనేది చిన్న అడ్డంకే కాని పెళ్లి అనే బంధానికి అంతం కాదు అంటుంది. ఆమె భర్త టోల్ కుఠ్ ఏడాది క్రితం దేహం విడిచారు. ఆ తర్వాత కిమ్ హాంగ్ ధ్యానంలో ఓ మాధ్యమానికి వెళ్లగా ఆమె భర్త ఆత్మ తనతో మాట్లాడారని తెలిపారు. అలా మాట్లాడిన మరు క్షణమే ఒక ఆవు దూడ తన జుట్టును..మెడను..తడిమిందని..బుగ్గపై ముద్దు పెట్టిందని..అవన్ని తన భర్తనే గుర్తుచేశాయంటూ తన అనుభవాన్ని తెలియజేసింది. అలా జరిగిన తర్వాత ఆవును తనతో ఇంటికి తీసుకువెళ్లానని..తన భర్త మేడ పైన ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగానే చేసిందని..తనకోసం భర్త మళ్లీ పునర్జన్మించాడని చెప్తోంది. కొద్ది రోజులు క్రితం ఆవు దూడను ఆమె వివాహం చేసుకున్నారు. ఆఖరికి పిల్లలు కూడా తమ తండ్రి మళ్లీ వచ్చాడని అంటున్నారు. దూడ ప్రవన్తనను చూసిన బంధువులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. రాత్రి పూట ఆవు తమ తండ్రికి ఇష్టమైన దిండు ఉంటేనే నిద్రిస్తుందని..తమ తండ్రి గదిలోనే ఎక్కువ సమయం గడుపుతుందని వారి కుమారుడు టోల్ వాండీ చెప్పాడు. తాను బతికినంత కాలం ఆవును ప్రాణంగా చూసుకుంటానని..చనిపోయాక అంతే ప్రేమ ఆప్యాయతలతో పిల్లలు చూసుకుంటారని చెప్పింది. ఆవు మరణానంతరం హిందూ సాంప్రదాయాలతో మానవులకు జరిపే విధానంలోనే అంత్యక్రియలు కూడా చేయమన్నట్లుగా తెలిపింది. దేశంలోనే ఈ ఆవు దూడ ఒక వైరల్ గా మారింది.. దేశ నలుమూలల నుండి వార్త తెలిసిన ప్రజలు ఆవు ఆప్యాయతను చూడటానికి తమ ఇంటికి వస్తున్నట్లుగా తెలిపారు బంధువులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy