పెళ్లి తర్వాత యాక్టింగ్ పై అలియాభట్ క్లారిటీ

ప్రియుడు రణబీర్ కపూర్ తో వివాహం తర్వాత అలియాభట్… సినిమాలకు ఫుల్ స్టాఫ్ పెట్టనుందా? అలియాభట్ రణబీర్ ని పెళ్లి చేసుకొని సొనిమాలకు టాటా చెప్పబోతుందనే వార్తలు వినిపిస్తున్న సమయంలో అలియా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో నెటిజన్ల హృదయాలను గెల్చుకుంటుంది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియాభట్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయన్ ముఖర్జీ డైరక్షన్ లో వస్తున్న బ్రహ్మాస్త్ర మావీ లో వీళ్లిద్దరూ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సైట్స్ పై ఉంది. ఈ సినిమా ఘూటింగ్ సమయంలో వీరిద్దరూ నువ్వులేక నేనులేను అన్నట్లుగా కలిసిపోయారు. అదేసమయంలో వీరిద్దరి పెళ్లి ప్రస్తావన కూడా కార్చిచ్చులా వ్యాపించింది. వీళ్లిద్దరూ కరెక్ట్ జోడి అని త్వరలోనే  పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. అయితే 2020 తర్వాత వీళ్ల పెళ్లి జరుగుతుందని కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అయితే రణబీర్ తో పెళ్లి తర్వాత సినిమాలకు అలియాభట్ ఫుల్ స్టాఫ్ పెడుతుందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆదివారం(ఆగస్టు-7) ఇన్ స్టాగ్రామ్ ద్వారా “ఆస్క్ మీ ఎనీథింగ్” సెషన్ లో పాల్గొన్న అలియాభట్ ను…. ఓ అభిమాని….మీరు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా అని అడిగాడు. దానికి అలియాభట్   బదులిస్తూ…..తాను ఎన్నాళ్లు యాక్ట్ చేయగల్గుతానే అన్నాళ్లు యాక్ట్ చేస్తానని తెలిపింది. అలియాభట్ రిప్లయితో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy