పెళ్లి పేరుతో మోసం…అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు

ou proffesorపెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసగించిన కాకతీయ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.కిరణ్ కుమార్ ను అరెస్టు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి భారీగా సొమ్ము కాజేసిన కిరణ్‌ కుమార్‌ (42) ను భద్రాచలంలో అరెస్టు చేశారు. కాకతీయ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఓయూ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్న ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఇటీవల ఆమెను కాకుండా మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. నిలదీసినందుకు బాధితురాలిపై దాడి చేశాడు. దీంతో ఓయూ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy